పంచాయతీ ట్రిబ్యునల్

 Gram Panchayats

 గ్రామపంచాయతీల్లోని వివాదాల పరిష్కారానికి వ్యవస్థ ఏర్పాటు
 ట్రిబ్యునల్‌కు చైర్మన్, ఇద్దరు సభ్యులు
పదవీకాలం మూడు సంవత్సరాలు
పారితోషికాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు
పంచాయతీ చట్టం కింద రెండు జీవోలు జారీ

మన తెలంగాణ/హైదరాబాద్ :గ్రామపంచాయతీల్లో నెలకొన్న వివాదాలను త్వరగా పరిష్కరించే ందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం జీవో నెంబర్ 48ను జారీ చేసింది. కాగా ట్రిబ్యునల్ మార్గదర్శకాల కోసం జీవో నెంబర్ 50ని విడుదల చేసింది. నూతన తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టంలోని సెక్షన్ 141 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సవరణ చట్టం సెక్షన్ 37, సబ్ సెక్షన్ (6) ప్రకారం గ్రామ పంచాయితీల వివాదాల అప్పీల్స్‌ను త్వరగా విచారించి వాటిపై ట్రిబ్యునల్ తగు తీర్పు చెప్పనుంది. ఈ ట్రిబ్యునల్‌లో ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు. వీరు మూడు సంవత్సరాల పాటు ట్రిబ్యునల్ చైర్మన్, సభ్యులుగా కొనసాగనున్నట్లుగా రాష్ట్ర ప్ఱభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాగా ట్రిబ్యునల్ చైర్మన్‌కు, ఇతర సభ్యులకు రెమ్యునరేషన్‌తో పాటు ఇతర సౌకర్యాలను కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ట్రిబ్యునల్ ఏర్పాటుతో గ్రామపంచాయితీల్లో నెలకొన్న వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవకాశం లభిస్తుంది. ఫలితంగా గ్రామాల్లో తలపెట్టిన పనుల్లో కూడా మరింత జోరు పెరగనుంది.

Issues In Gram Panchayats

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పంచాయతీ ట్రిబ్యునల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.