జులై 9 ప్రయాణానికి చంద్రయాన్-2 సిద్ధం

  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇప్పుడు చంద్రయాన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చంద్రయాన్ 2 కీలక ప్రయోగం ఇప్పుడు తుది దశకు చేరుకుంది. పనుల సమన్వయ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. తమిళనాడు లోని మహేంద్ర గిరి, బెంగళూరులోని బ్యలాలూల్లో తుది పరీక్షలు జరుగుతు న్నాయి. వచ్చే నెల 9వ తేదీన చంద్రయాన్ 2 ప్రయోగానికి ఇస్రో సిద్ధం అవుతోంది. ఇస్రో ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19వ తేదీన అంతరిక్ష నౌక బెంగళూరు నుంచి […] The post జులై 9 ప్రయాణానికి చంద్రయాన్-2 సిద్ధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇప్పుడు చంద్రయాన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చంద్రయాన్ 2 కీలక ప్రయోగం ఇప్పుడు తుది దశకు చేరుకుంది. పనుల సమన్వయ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. తమిళనాడు లోని మహేంద్ర గిరి, బెంగళూరులోని బ్యలాలూల్లో తుది పరీక్షలు జరుగుతు న్నాయి. వచ్చే నెల 9వ తేదీన చంద్రయాన్ 2 ప్రయోగానికి ఇస్రో సిద్ధం అవుతోంది. ఇస్రో ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19వ తేదీన అంతరిక్ష నౌక బెంగళూరు నుంచి బయలుదేరుతుంది. శ్రీహరికోట లోని ప్రయోగ స్థలికి 20న కానీ 21వ తేదీన కానీ చేరుతుంది. చంద్రయాన్ 2ను శాస్త్రజ్ఞులు చంద్రుడిపై కన్న కలగా పేర్కొంటున్నారు. పలు స్థాయిలలో ఇది విశిష్టతను సంతరించుకుంది. చంద్రుడి ఉపరితలంపైకి ఇంతవరకూ ఎవరూ చేరుకోని ప్రాంతానికి వెళ్లాలనేది లక్షంగా పెట్టుకున్నారు. 3 డి మ్యాపింగ్ మొదలుకుని, చంద్రుడిపై ఖనిజాల అన్వేషణ వంటివాటివి ఈ యాత్ర సంకల్పాలుగా పెట్టుకున్నారు. – న్యూఢిల్లీ/బెంగళూరు

7 ఛాలెంజ్‌లు
చంద్రుడిపై వాలేందుకు చిక్కులెన్నో
1) చంద్రుడి వద్దకు చేరుకోవడానికి ఖచ్చితమైన ప్రయాణ దూరం 3,844 లక్షల కిలోమీటర్లు. ప్రయాణ దూరాన్ని ఖచ్చితంగా నిర్థారించుకోవడం కీలకం. అయితే చంద్రుడిపై వివిధ ప్రాంతాలలో ఆకర్షణతో విభిన్న ఒత్తిళ్లతో ఇది ప్రభావితం అవుతుంది. ఇతర ఖగోళ పదార్థాలు, సౌర అణుధార్మికత ఒత్తిళ్ల వంటివి కూడా ప్రభావం చూపుతాయి.
2) సుదీర్ఘ దూరం, వాహక నౌకలో పరిమిత ఇంధనంతో తలెత్తే ప్రగాఢ అంతరిక్ష సమాచార వ్యవస్థ సమస్య తలెత్తుతుంది. సమాచారంలో జాప్యం ఏర్పడుతుంది. వాహక నౌక నుంచి పంపించే ప్రతి సందేశం కొద్ది నిమిషాల తరువాత చేరుతుంది. నేపథ్యంలో విన్పించే శబ్దంతో సిగ్నల్స్ బలహీనపడుతాయి. వీటిని ఆంటెనాలతో గ్రహించాల్సి ఉంటుంది.
3) చంద్రుడి వద్దకు చేరుకోవడానికి పలు సార్లు ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ మరియు లానార్ క్యాప్చర్ మిషన్‌లు ఇంధనాన్ని మండించాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాలు తరచూ మారుతూ ఉంటాయి. స్పేస్‌క్రాఫ్ట్, చంద్రుడి గమనాలను ముదుగానే సరిగ్గా, నిర్థిష్టంగా నిర్ధేశించుకోవల్సి ఉంటుంది. ఈ క్రమంలో తప్పిదాలను లేకుండా చేసుకోవాలి.
4) చంద్ర మండల ఆకర్షణ శక్తి చుట్టూ పరిభ్రమించడం మందకొడిగా మారుతుంది. సమతూకంగా లేని ద్రవ్యరాశితో స్పేస్‌క్రాఫ్ట్ పరిభ్రమణపై ప్రభౠవం పడుతుంది. చంద్రుడికి వంద కిలోమీటర్ల దూరంలో ఉండగానే అక్కడి ఉష్ణోగ్రత గురించి ఖచ్చితమైన అవగావహన ఉండాలి.
5) చంద్రుడి వద్దకు దూరాన్ని సరిగ్గా అంచనా వేయడంలో చంద్రుడిపై ఉండే ఆకర్షణ శక్తిలోని తేడాలు దీనితో తలెత్తే సురక్షిత ల్యాండింగ్ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అన్ని వ్యవస్థలు సమీకృత దిశలో పనిచేయాల్సి ఉంటుంది. చంద్రుడిపైకి దిగే చోటు కమ్యూనికేషన్ల ప్రసారానికి అంతరాయం కల్పించే చోట ఉండకూడదు.
6) చంద్ర ఉపరితలానికి సమీపంలోకి వచ్చిన తరు

వాత ఇంజిన్ల ఇంధనాన్ని మండించడం ద్వారా చంద్రమండలంపై దుమ్మును తొలిగించడం కీలకం అవుతుంది. ఈ ప్రక్రియ దశలో వేడిగాలులు, దుమ్మూ వెనకకు తన్నుకువస్తాయి. చంద్రుడిపై ఉండే దుమ్ము కటువైన కణజాలంగా ఉంటుంది. దీని ప్రతికూల ప్రభావంతో అక్కడ దిగే ఏ వస్తువు అయినా అతుక్కుపోతుంది. దీనితో యంత్రాలను ఉపరితలానికి పంపించడంలో అవాంతరాలు ఏర్పడుతాయి. సోలార్ ప్యానల్ పనితీరు ఇతరత్రా వ్యవస్థలపై ప్రభావం పడుతుంది.
7) తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు, శూన్యతలతో చంద్ర మండలంపై ఒక రోజు లేదా ఒక రాత్రి భూమిపై ఉండే 14 రోజులతో సమానం అవుతాయి. దీనితో ఉపరితలంపై తీవ్రస్థాయి ఉష్ణోగ్రతల తేడాలొస్తాయి. ఉపరితలంపై అసమతుల్య ఒత్తిడి, దీనితో పాటు కఠిన శూన్యత వంటివి ల్యాండర్ మరియు రోవర్‌లకు చాలా ప్రతికూల వాతావరణాన్ని కల్పిస్తాయి.
చంద్రుడిని అధ్యయనం చేసేందుకు ఉపయోగపడే సాధనాలు (పే లోడ్స్)

ఆర్బిటర్‌కు సంబంధించి
1) టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా 2 (టిఎంసి 2 ) దీనితో సవివర 3 డి మ్యాప్‌లను సిద్ధం చేయవచ్చు
2) కొలిమేటెడ్ లార్జ్ అర్రే సాఫ్ట్ ఎక్స్ రే స్పెక్టోమీటర్ (క్లాస్): దీనితో ప్రధాన రాతి స్థాపక పదార్థాల చిత్రాలను విరివిగా తీయవచ్చు.
3 ) సోలార్ ఎక్స్ రే మానిటర్ (ఎక్స్‌ఎస్‌ఎం) : ఇది సూర్యుడి నుంచి వచ్చే ఎక్స్ రేలను గ్రహిస్తూ క్లాస్ పరికరానికి దోహదపడుతుంది.
4) ఆర్బిటార్ హై రిసల్యూషన్ కెమెరా (ఒహెచ్‌ఆర్‌సి): ఇది ల్యాండింగ్ చోటు గురించి సరైన సాంద్రతతో కూడిన చిత్రాలను అందిస్తుంది.
5) ఇమేజింగ్ ఇన్‌ఫ్రా రెడ్ స్పెక్ట్రమ్ ఇటెర్ (ఐఐఆర్‌ఎస్) : ఖనిజాలను గుర్తిస్తుంది. జల కణాలు, హైడ్రోక్రిల్ అవశేషాలను పసికడుతుంది.
6) సింథెటిక్ అపెర్చర్ రాడార్ (సార్) : చంద్రుడిపై గుంతలు, ఇతర లక్షణాలను ప్రత్యేకించి ధృవ ప్రాంతాల్లోని వాటిని చిత్రీకరిస్తుంది.
7) చంద్రాస్ అట్మాస్పెరిక్ కామ్ పొజిషన్ ఎక్స్‌ప్లోరర్ ( సిహెచ్‌ఎసిఇ 2) : దీనితో చంద్రుఇ బాహ్యాంతరాళాలను సమగ్రంగా అధ్యయనం చేయవచ్చు.
8) రేడియో అస్ట్రానమి ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ ఐనోస్పియర్ అండ్ అట్మాస్పియర్ ( రాంభా) : దీనితో సంపూర్ణ ఎలక్ట్రానిక్ వలయ మొత్తాన్ని (టిఇసి)ని లెక్కించవచ్చు.

ల్యాండర్
1) రాంబా : దీనితో చంద్రుడి ఐనోస్పియర్, ఇతరత్రా ఉండే టిఇసిని లెక్కించవ్చు.
2) చాసెట్ : దీనితో ధృవ ప్రాంతంలోని శక్తిని విశ్లేషించవచ్చు.
3) ఐఎల్‌ఎస్‌ఎ : దీనితో ల్యాండింగ్ సైట్‌లోని గురుత్వాకర్షణ శక్తిని గ్రహించవచ్చు.

రోవర్
1) ఎల్‌ఐబిఎస్ : దీనితో చంద్రుడిపై రసాయనిక సాంద్రత ఇతర ఉపరితల అంశాలను గ్రహించవచ్చు.
2) అల్ఫా కణాల ఇటెర్ లేదా ఎపిఎక్స్‌స్ దీనితో రాతి, ఉపరితల నిర్మాణ పదార్థాన్ని నిర్థారించవచ్చు.
గమనిక : 13 శాస్త్రీయ పరికరాలతో పాటు ఈ యాత్రలో నాసాకు చెందిన పేలోడ్ రిట్రోరిఫ్లెక్టర్‌ను కూడా పంపిస్తారు.

ISRO launching Chandrayaan-2 on July 9th

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జులై 9 ప్రయాణానికి చంద్రయాన్-2 సిద్ధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: