20 వేల రైల్ కోచ్‌ల్లో 3.2 లక్షల ఐసొలేషన్ బెడ్స్

Isolation beds

 

న్యూఢిల్లీ : కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించడానికి 20 వేల రైలు కోచ్‌లను ఐసొలేషన్ వార్డులుగా మార్పు చేసినట్టు భారత రైల్వే మంగళవారం వెల్లడించింది. ఈ కోచ్‌ల ద్వారా 3.2 లక్షల పడకలు కరోనా రోగులకు అందుబాటు లోకి వస్తాయి. ఈమేరకు 16 జోన్లకు లక్షాలు నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే కేంద్రమైన సికింద్రాబాద్ (తెలంగాణ) 486 కోచ్‌లను కరోనా రోగుల కోసం కేటాయించింది. ముంబై కేంద్రమైన సెంట్రల్ రైల్వే 482 కోచ్‌లు కేటాయించింది. ప్రస్తుతం 5000 కోచ్‌లను 80000 పడకలుగా మార్చే పని ప్రారంభమైంది. ఒక్కో కోచ్‌లో 16 ఐసొలేషన్ బెడ్స్ ఉంటాయి. నాన్ ఎసి ఐసిఎఫ్ స్లీపర్ కోచ్‌లను క్వారంటైన్, ఐసొలేషన్ కోచ్‌లుగా మారుస్తున్నారు.

Isolation beds in rail coaches

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 20 వేల రైల్ కోచ్‌ల్లో 3.2 లక్షల ఐసొలేషన్ బెడ్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.