‘ఇస్మార్ట్‌ శంకర్’ టీజర్‌ విడుదల

హైదరాబాద్‌: పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో హీరో రామ్‌ నటిస్తున్న సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్’. బుధవారం రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ  సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘పతా హై మై కౌన్‌ హూ.. శంకర్‌.. ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌’ అని రామ్‌ స్టైల్‌గా తన పేరుని చెప్తున్న సన్నివేశంతో టీజర్‌ మొదలైంది. డ్యాన్స్‌, ఫైటింగ్‌ సన్నివేశాల్లో రామ్‌ చాలా స్టైలిష్‌గా కనిపించారు. ‘నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముంగిట పొట్టేలుని కట్టేసినట్లే..’ అని  రామ్ చెప్పిన  […] The post ‘ఇస్మార్ట్‌ శంకర్’ టీజర్‌ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌: పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో హీరో రామ్‌ నటిస్తున్న సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్’. బుధవారం రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ  సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘పతా హై మై కౌన్‌ హూ.. శంకర్‌.. ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌’ అని రామ్‌ స్టైల్‌గా తన పేరుని చెప్తున్న సన్నివేశంతో టీజర్‌ మొదలైంది. డ్యాన్స్‌, ఫైటింగ్‌ సన్నివేశాల్లో రామ్‌ చాలా స్టైలిష్‌గా కనిపించారు. ‘నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముంగిట పొట్టేలుని కట్టేసినట్లే..’ అని  రామ్ చెప్పిన  డైలాగ్‌ టీజర్ లో  హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, ఛార్మి ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గోవాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. రామ్‌, నభాలపై ఓ పాటను తీస్తున్నారు. మరో మూడు పాటలను చిత్రీకరిస్తే సినిమా పూర్తవుతుందని సినిమా యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాకు  మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. జులైలో ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కొంతకాలంగా అపజయాలతో సాగుతున్న పూరీకి ఈ సినిమా హిట్ ఇస్తుందన్న అభిప్రాయాన్ని టాలీవుడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

Ismart Shankar Teaser Release

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘ఇస్మార్ట్‌ శంకర్’ టీజర్‌ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: