ఉగ్ర సంస్థలతో ఐఎస్ఐ కీలక భేటీ

ISIఇస్లామాబాద్ : పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలతో కీలక భేటీ నిర్వహించింది. భారత్ లో ఉగ్రదాడులే లక్ష్యంగా ఈ భేటీ జరిగినట్టు భారత నిఘా సంస్థలు పసిగట్టాయి. దీంతో భారత్ అప్రమత్తమైంది.  జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఖలిస్థానీ జిందాబాద్ ఫోర్స్ తదితర సంస్థలు ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్ విభజన , ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ లో ఏ క్షణమైనా దాడులు చేసేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారన్న సమాచారం భారత్ ఆర్మీ వద్ద ఉంది. భారత్ పై ఉగ్రదాడులు చేసేందుకు ఈ భేటీలో ఐఎస్ఐ ఉగ్ర సంస్థలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత ఆర్మీ అప్రమత్తమై ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలతో పాటు దేశంలోని కీలక నగరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

ISI Meeting With Militant Organizations

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉగ్ర సంస్థలతో ఐఎస్ఐ కీలక భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.