వెండితెర‌పైకి పఠాన్, హర్బజన్

Irfan-Pathan-and-Harbhajan

ముంబయి: టీమిండియా క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వెండితెర‌పై సంద‌డి చేయబోతున్నారు.ఇప్ప‌టికే ప‌లువురు క్రికెట‌ర్లు స్క్రీన్‌పై సంద‌డి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ లిస్ట్‌లో హర్బజన్‌, ఇర్ఫాన్‌ పటాన్ చేరారు. అజ‌య్ ముత్తు డైరెక్షన్ లో తమిళ స్టార్ విక్రమ్ నటిస్తోన్న సిన్మాలో పఠాన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. కాగా, యోగి దర్శకత్వం వహించే ‘డిక్కీలూనా’ చిత్రంలో హ‌ర్భ‌జ‌న్ సింగ్ నటిస్తున్నాడు. మైదానంలో బంతిని గిర‌గిర తిప్పి బ్యాట్స్‌మెన్స్ తన బౌలింగ్ తో ముప్పుతిప్పలు పెట్టే బజ్జీ డిక్కీలోనా సిన్మాలో కీలక పాత్ర పోషిస్తున్నార‌ట‌. ఇప్పటి వరకు మైదానంలో సత్తా చాటిన ఈ క్రికెటర్లు వెండితెరపై ఎలా సందడి చేస్తారో చూడాలి. అయితే ఈ ఇద్ద‌రి పాత్ర‌లు ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్ అందించే విధంగా ఉంటాయ‌ని మూవీ మేక‌ర్స్ అంటున్నారు.

Irfan Pathan and Harbhajan Singh debut in Tamil cinema

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వెండితెర‌పైకి పఠాన్, హర్బజన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.