డిజిపి పదోన్నతి ఇవ్వండి.. లేకపోతే రాజీనామా చేస్తా

సిఎం, సిఎస్‌లకు సీనియర్ ఐపిఎస్ వికెసింగ్ లేఖ మనతెలంగాణ/హైదరాబాద్ : తనకు డిజిపిగా పదోన్నతి కల్పించాలని, లేనిపక్షంలో తాను రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ సీనియర్ ఐపిఎస్ అధికారి వినోయ్‌కుమార్ సింగ్ ప్రభుత్వానికి లేఖ ద్వారా విన్నవించారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టిఎస్‌పిఎ)కు డైరెక్టర్ ఉన్న వికె సింగ్ (ఎడిజి) తనకు డిజిపిగా పదోన్నతి కల్పించాలంటూ ప్రభుత్వ సిఎం కెసిఆర్, ప్రభుత్వ సిఎస్ సోమేష్‌కుమార్‌కు లేఖ రాశారు. అదేవిధంగా మరో కాపీని కేంద్ర హోంశాఖకు పంపారు. […] The post డిజిపి పదోన్నతి ఇవ్వండి.. లేకపోతే రాజీనామా చేస్తా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
సిఎం, సిఎస్‌లకు సీనియర్ ఐపిఎస్ వికెసింగ్ లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్ : తనకు డిజిపిగా పదోన్నతి కల్పించాలని, లేనిపక్షంలో తాను రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ సీనియర్ ఐపిఎస్ అధికారి వినోయ్‌కుమార్ సింగ్ ప్రభుత్వానికి లేఖ ద్వారా విన్నవించారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టిఎస్‌పిఎ)కు డైరెక్టర్ ఉన్న వికె సింగ్ (ఎడిజి) తనకు డిజిపిగా పదోన్నతి కల్పించాలంటూ ప్రభుత్వ సిఎం కెసిఆర్, ప్రభుత్వ సిఎస్ సోమేష్‌కుమార్‌కు లేఖ రాశారు. అదేవిధంగా మరో కాపీని కేంద్ర హోంశాఖకు పంపారు. కాగా ఆ లేఖలో 1987 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన తనకు 33 ఏళ్లు సేవలందించిన అనుభవం ఉందని, తాను ఇప్పటికే డిజిపి పోస్టు కోసం ఎంప్యానెల్ అయ్యానని, నిబంధనల ప్రకారం ఆ పదవికి తాను అన్ని విధాలా అర్హతలు కలిగి ఉన్నానని వికెసింగ్ విన్నవించారు.

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post డిజిపి పదోన్నతి ఇవ్వండి.. లేకపోతే రాజీనామా చేస్తా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: