ఐపిఎల్ లేనట్టేనా?

ముంబై: కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గమినిస్తే ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్ కొనసాగడం కష్టంగానే కనిపిస్తోంది. కరోనా దెబ్బకు ఇప్పటికే ఎన్నో క్రీడలు అర్ధాంతరంగా రద్దయిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలన్ని కరోనా మహమ్మరి ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఇక, భారత్‌లో కూడా కరోనా రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చింది. కరోనా దెబ్బకు భారత్‌లో పరిస్థితి ఆందోళన కరంగా తయారైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా […] The post ఐపిఎల్ లేనట్టేనా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబై: కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గమినిస్తే ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్ కొనసాగడం కష్టంగానే కనిపిస్తోంది. కరోనా దెబ్బకు ఇప్పటికే ఎన్నో క్రీడలు అర్ధాంతరంగా రద్దయిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలన్ని కరోనా మహమ్మరి ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఇక, భారత్‌లో కూడా కరోనా రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చింది. కరోనా దెబ్బకు భారత్‌లో పరిస్థితి ఆందోళన కరంగా తయారైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు ప్రకటించారు. మరి కొన్ని రాష్ట్రాల్లో నిరవధిక కర్ఫూను విధించారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఐపిఎల్‌ను కొనసాగించడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఏప్రిల్ 15 వరకు ఐపిఎల్‌ను వాయిదా వేశారు. అయితే గతంతో పోల్చితే ప్రస్తుతం కరోనా మరింత విజృంభించింది. తాజా స్థితిని గమనిస్తే ఐపిఎల్‌ను నిర్వహించడం కష్టంగా మారింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్ర రూపం దాల్చింది. వందలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపిఎల్ నిర్వహించడం భారత క్రికెట్ బోర్డుకు సవాలుగా తయారైంది. మంగళవారం బిసిసిఐ, ఫ్రాంచైజీ యాజమాన్యాల మధ్య జరిగే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
నిరాశలో అభిమానులు


కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో క్రీడలు రద్దయ్యాయి. తాజాగా ఐపిఎల్, ఒలింపిక్స్ క్రీడల భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మెగా క్రీడలు కొనసాగడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇక, భారత్‌లో ఎంతో జనాదారణ కలిగిన ఐపిఎల్ టి20 టోర్నీపై కూడా కరోనా ప్రభావం బాగానే పడింది. ఇప్పటికే ఓసారి వాయిదా పడిన ఐపిఎల్ ప్రస్తుతం పూర్తిగా రద్దయ్యే పరిస్థితికి చేరుకుంది. కరోనా రోజురోజుకు తీవ్ర రూపం సంతరించుకుంటున్న పరిస్థితుల్లో ఈ టోర్నీని రద్దు చేసే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. దీంతో కోట్లాది మంది అభిమానుల్లో నిరాశ నెలకొంది.

IPL 2020 Season Ban due to Coronavirus?

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఐపిఎల్ లేనట్టేనా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.