వాట్సన్‌పై ప్రశంసల వర్షం

  ముంబై: చెన్నై సూపర్‌కింగ్స్ స్టార్ ఆటగాడు షేన్ వాట్సన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్లో ఓ వైపు గాయం బాధిస్తన్న మొక్కువోని ధైర్యంతో బ్యాటింగ్ చేసి చెన్నైకు అండగా నిలిచాడు. ఫీల్డింగ్ సందర్భంగా వాట్సన్ మోకాలికి తీవ్ర గాయమైంది. ఈ విషయాన్ని వాట్సన్ బయట పెట్టలేదు. అంతేగాక గాయానికి బ్యాండెజ్ పెట్టుకుని బ్యాటింగ్‌కు దిగాడు. ఈ మ్యాచ్‌లో సహచరులు ఒక్కొక్కరే పెవిలియన్ చేరుతున్న వాట్సన్‌పై అసాధారణ పోరాట పటిమతో చెలరేగి పోయాడు. […] The post వాట్సన్‌పై ప్రశంసల వర్షం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబై: చెన్నై సూపర్‌కింగ్స్ స్టార్ ఆటగాడు షేన్ వాట్సన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్లో ఓ వైపు గాయం బాధిస్తన్న మొక్కువోని ధైర్యంతో బ్యాటింగ్ చేసి చెన్నైకు అండగా నిలిచాడు. ఫీల్డింగ్ సందర్భంగా వాట్సన్ మోకాలికి తీవ్ర గాయమైంది. ఈ విషయాన్ని వాట్సన్ బయట పెట్టలేదు. అంతేగాక గాయానికి బ్యాండెజ్ పెట్టుకుని బ్యాటింగ్‌కు దిగాడు. ఈ మ్యాచ్‌లో సహచరులు ఒక్కొక్కరే పెవిలియన్ చేరుతున్న వాట్సన్‌పై అసాధారణ పోరాట పటిమతో చెలరేగి పోయాడు. ప్యాడ్ల వెనకాల నుంచి రక్తం ఏకధాటిగా కారుతున్నా వాట్సన్ ఆధైర్య పడలేదు. తనదైన శైలీలో ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. కాగా, వాట్సన్ ఈ మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 80 పరుగులు చేసి చెన్నైకి దాదాపు విజయం అందించినంత పని చేశాడు. అయితే చివర్లో ఔట్ కావడంతో చెన్నైకు ఓటమి తప్పలేదు.

అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై ఓటమి పాలైనా వాట్సన్ మాత్రం కోట్లాది మంది అభిమానుల మనసులను దోచుకున్నాడు. అతని హీరోచిత బ్యాటింగ్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. చెన్నై అంటే ఏమాత్రం ఇష్టం ఉండని ముంబై అభిమానులు సైతం వాట్సన్ పోరాట పటిమకు ఫిదా అయ్యారు. ఓవైపు గాయం వెంటాడుతున్నా దాని ప్రభావం తన బ్యాటింగ్ పడకుండా ఆడడం అందరికి సాధ్యం కాదని, అయితే వాట్సన్ ఈ విషయంలో అందరికి ఆదర్శంగా నిలిచాడని ప్రశంసించారు. వాట్సన్‌కు గాయమైన విషయాన్ని సిఎస్‌కె ఆటగాడు హర్భజన్ సింగ్ సింగ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. దీంతో వాట్సన్ పోరాట పటిమ, ఆటపై అంకితభావం అంశం వెలుగులోకి వచ్చింది. క్లిష్ట సమయంలోనూ అతను కొనసాగించిన పోరాటంపై అభిమానులు ఫిదా అయ్యారు. ఇక, కొందరు అభిమానులు వాట్సన్‌ను భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లేతో పోల్చారు. గతంలో పాకిస్థాన్‌తో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో కుంబ్లేకు తలకు గాయమైంది. అయినా కుంబ్లే కుట్లు కట్టుకుని ఆ మ్యాచ్‌లో బౌలింగ్ చేశాడు. అప్పట్లో కుంబ్లే అంకితభావాన్ని చూసిన అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా వాట్సన్‌పై కూడా ఇలాంటే ప్రశంసలే చేశారు.

IPL 2019 Final: Watson showered with respect on twitter

The post వాట్సన్‌పై ప్రశంసల వర్షం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: