జోరుగా బ్లాక్ దందా

  బ్లాక్ మార్కెట్‌కు ఐపిఎల్ ఫైనల్ టికెట్లు  పట్టించుకోని హెచ్‌సిఎ, అభిమానుల ఆగ్రహం మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య ఆదివారం జరిగే ఐపిఎల్ సీజన్12 ఫైనల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని నగర క్రికెట్ అభిమానులు వాపోతున్నారు. ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించే అవకాశం హైదరాబాద్‌కు దొరకడంతో నగర అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే ఈ మ్యాచ్‌ను చూడాలని తహతహలాడుతున్న అభిమానులకు […] The post జోరుగా బ్లాక్ దందా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బ్లాక్ మార్కెట్‌కు ఐపిఎల్ ఫైనల్ టికెట్లు

 పట్టించుకోని హెచ్‌సిఎ, అభిమానుల ఆగ్రహం
మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య ఆదివారం జరిగే ఐపిఎల్ సీజన్12 ఫైనల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని నగర క్రికెట్ అభిమానులు వాపోతున్నారు. ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించే అవకాశం హైదరాబాద్‌కు దొరకడంతో నగర అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే ఈ మ్యాచ్‌ను చూడాలని తహతహలాడుతున్న అభిమానులకు టికెట్ల దొరకడం గగనంగా మారింది. టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. అభిమానుల కోసం అందుబాటులో ఉంచిన టికెట్ల బ్లాక్ మార్కెట్‌కు తరలి పోయాయి. దీంతో టికెట్ల్లు దొరకక అభిమానులు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. ఐపీఎల్ ఫైనల్ చూడాలని ఉత్సాహంగా వచ్చే అభిమానులకు టికెట్ల గోల్‌మాల్ ఇబ్బందిగా తయారైంది. రాకరాక అవకాశం రావడంతో ఫైనల్ మ్యాచ్‌ను ఎలాగైనా చూడాలనే ఉద్దేశంతో నగర క్రికెట్ అభిమానులు ఉన్నారు. అభిమానుల బలహీనతలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న కొందరూ టికెట్లను అధిక ధరకు అమ్ముతు బ్లాక్ దందాకు తెరలేపారు. ఫైనల్ మ్యాచ్‌కు విపరీత డిమాండ్ ఏర్పడడంతో టికెట్లను సొంతం చేసుకున్న కొందరు దాన్ని బ్లాక్‌లో అమ్మేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా టికెట్ల బ్లాక్ దందాను బహిరంగంగానే మొదలు పెట్టారు.

 

కాగా, ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి టికెట్లను విక్రయించే వెబ్‌సైట్లు కొద్ది సేపు మాత్రమే పని చేశాయి. ఈ వెట్‌సైట్లలో ఎలాంటి ముందుస్తు సమాచారం లేకుండానే కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే టికెట్లను అందుబాటులో ఉంచారు. అనంతరం సర్వర్ డౌన్ అయిందని బుకాయించిన నిర్వాహకులు.. వెంటనే సోల్ ఔట్ అని బోర్డు పెట్టేశారు. ఇక ఆ కొద్ది నిమిషాల్లో టికెట్లు బుక్ చేసుకున్నవారు జింఖానా గ్రౌండ్స్‌కు వచ్చి టికెట్లు తీసుకోవడానికి దాదాపు ఐదు గంటలకు పైగా క్యూ లైన్లలో పడిగాపులు పడ్డారు. ఇక అన్ని సైట్లలలో టికెట్స్ సోల్ ఔట్ దర్శనమిస్తున్నప్పటికీ బ్లాక్‌లో మాత్రం టికెట్ల దందా జోరుగా సాగుతోంది. టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్, ఉప్పల్ స్టేడియం చుట్టూ క్రికెట్ అభిమానులు చక్కర్లు కొడుతున్నారు. స్టేడియం వెలుపల రూ. 2 వేల టికెట్లను బ్లాక్‌లో రూ.5 వేల నుంచి రూ. 6 వేల వరకు అమ్ముతున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు. దాదాపు 36 వేల సిట్టింగ్ కెపాసిటీ ఉన్న ఉప్పల్ స్టేడియంలో దాదాపు 15వేల టికెట్ల వరకు స్పాన్సర్లు, బీసీసీఐ, ఇతర రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు కేటాయించారు. మిగిలిన 21వేల టికెట్లను అభిమానుల కోసం అందుబాటులో ఉంచారు. కాగా, టికెట్ల అమ్మకంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సిఎ) పారదర్శకత పాటించడం లేదని అభిమానులు మండిపడుతున్నారు. ఇందులో కూడా కామన్ టికెట్లనే బ్లాక్ చేశారని.. ఎక్కువ ధర టికెట్లను మాత్రమే అమ్మారని.. ప్రస్తుతం అవి కూడా దొరకని పరిస్థితికి అధికారులు తీసుకొచ్చారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా అనుకోకుండా అందివచ్చిన అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని హెచ్‌సిఎలోని కొందరు పెద్దలు ప్రయత్నిస్తున్నారని, ఇందులో భాగంగానే బ్లాక్ టికెట్ల వ్యవహరానికి తెరలేపారని అభిమానులు ఆరోపిస్తున్నారు.

IPL 2019 Final: black mark on IPL tickets

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జోరుగా బ్లాక్ దందా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: