ఉప్పల్ బెర్త్ ఎవరిదో?

చెన్నైతో ఢిల్లీ అమీతుమీ, నేడు క్వాలిఫయర్2 సమరం విశాఖపట్నం: ఇందులో గెలిచే జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఫైనల్ సమరం ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. ముంబై ఇండియన్స్ ఇప్పటికే తుది పోరుకు చేరుకుంది. చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య విజేతతో ముంబై ఫైనల్లో ఢీకొంటుంది. కాగా, పటిష్టమైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ సమరంలో ఢిల్లీ చారిత్రక విజయంతో క్వాలిఫయర్2కు అర్హత సాధించింది. ఇక, చెన్నైతో జరిగే నాకౌట్ సమరంలోనూ గెలిచి ఫైనల్‌కు చేరుకోవాలనే పట్టుదలతో […] The post ఉప్పల్ బెర్త్ ఎవరిదో? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నైతో ఢిల్లీ అమీతుమీ, నేడు క్వాలిఫయర్2 సమరం
విశాఖపట్నం: ఇందులో గెలిచే జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఫైనల్ సమరం ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. ముంబై ఇండియన్స్ ఇప్పటికే తుది పోరుకు చేరుకుంది. చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య విజేతతో ముంబై ఫైనల్లో ఢీకొంటుంది. కాగా, పటిష్టమైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ సమరంలో ఢిల్లీ చారిత్రక విజయంతో క్వాలిఫయర్2కు అర్హత సాధించింది. ఇక, చెన్నైతో జరిగే నాకౌట్ సమరంలోనూ గెలిచి ఫైనల్‌కు చేరుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు తొలి క్వాలిఫయర్‌లో ముంబై చేతిలో చిత్తుగా ఓడిన చెన్నైకు ఢిల్లీతో పోరు సవాలుగా మారింది. ఇందులో విజయం సాధించాలంటే చెన్నై అసాధారణ ఆటను కనబరచక తప్పదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్నా నిలకడలేమి చెన్నైకు ప్రధాన సమస్యగా మారింది. ముంబై చేతిలో ఓటమికి కూడా ఇదే ప్రధాన కారణంగా నిలిచింది. అయితే ఢిల్లీతో జరిగే కీలక పోరులో పొరపాట్లకు తావులేకుండా ఆడాలన్నదే ధోని సేన లక్షంగా పెట్టుకుంది.
ఓపెనర్లు ఈసారైనా
చెన్నైకు ఓపెనర్ల సమస్య వెంటాడుతోంది. ఆశించిన స్థాయిలో శుభారంభం అందించడంలో ఓపెనర్లు డుప్లెసిస్, షేన్ వాట్సన్‌లు విఫలమవుతున్నారు. ముంబైతో పోరులో కూడా ఓపెనర్లు నిరాశ పరిచారు. దీని ప్రభావం జట్టుపై పడింది. ఈసారి మాత్రం ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో వీరిద్దరూ మెరుగ్గా ఆడక తప్పదు. ఇక, సీనియర్ ఆటగాళ్లు అంబటి రాయుడు, సురేశ్ రైనాలు కూడా తమ బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోక తప్పదు. ఈ సీజన్‌లో రాయుడు ఆశించిన స్థాయిలో ఆడలేదనే చెప్పాలి. అతని వైఫల్యం జట్టుకు సమస్యగా తయారైంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రాయుడు చెలరేగితే చెన్నైకు విజయం నల్లేరుపై నడకే. ఇక, రైనా కూడా ఈ సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. అడపాదడపా మాత్రమే బ్యాట్‌ను ఝులిపిస్తున్నాడు. ఈసారైనా తన స్థాయి ఆటను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇతర జట్లతో పోల్చితే చెన్నై బ్యాట్స్‌మెన్‌లు అంతంత మాత్రంగానే రాణించారని చెప్పక తప్పదు. టాప్ టెన్ బ్యాట్స్‌మెన్‌లో ఒక్క చెన్నై బ్యాట్స్‌మన్ కూడా లేక పోవడమే దీనికి నిదర్శనం. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 405 పరుగులతో పదమూడో స్థానంలో నిలువగా, రైనా 364 పరుగులతో 19వ స్థానంలో కొనసాగుతున్నాడు. దీన్ని బట్టి చెన్నై బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇదిలావుండగా ఈ మ్యాచ్‌లో కూడా చెన్నైకు కెప్టెన్ ధోనినే కీలకంగా మారాడు. అతను రాణించడంపైనే జట్టు గెలుపొటములు ఆధారపడి ఉన్నాయి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన ధోని విజృంభిస్తే ఢిల్లీ బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక, రవీంద్ర జడేజా, బ్రావో తదితరులు రాణిస్తే చెన్నైకు తిరుగుండదు. మరోవైపు బౌలింగ్‌లో చెన్నై చాలా బలంగా ఉంది. ఇమ్రాన్ తాహిర్, హర్భజన్ సింగ్, జడేజా, దీపక్ చాహర్, బ్రావో తదితరులతో బౌలింగ్ పటిష్టంగా మారింది. చెన్నై సాధించిన విజయాల్లో బౌలర్లే కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు బౌలర్లపై భారీ ఆశలు పెట్టుకుంది.
జోరు సాగాలి
మరోవైపు సంచలన విజయాలతో ఐపిఎల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ బెర్త్‌కు ఒక మెట్టు దూరంలో నిలిచింది. పెద్దగా అంచనాలు లేకుండానే బరిలకో దిగిన ఢిల్లీ చిరస్మరణీయ విజయాలతో టాప్3లో నిలిచింది. ఇక, హైదరాబాద్ వంటి బలమైన జట్టును ఎలిమినేటర్‌లో ఓడించింది. చెన్నైతో జరిగే క్వాలిఫయర్2కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఢిల్లీ పటిష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కిమోపాల్, అమిత్ మిశ్రా, ఇషాంత్‌లు అద్భుతంగా రాణించారు. ఇక, బ్యాటింగ్‌లో పృథ్వీషా, రిషబ్ పంత్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. కిందటి మ్యాచ్‌లో విఫలమైన సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లు ఈసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. రిషబ్‌పంత్ భీకర ఫామ్‌లో ఉండడం ఢిల్లీకి కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ధావన్, షా, అయ్యర్‌లతో బ్యాటింగ్ బలంగా ఉంది. అయితే నిలకడలేమి ఢిల్లీకి ప్రధాన సమస్యాగా తయారైంది. ఈ లోటును సరిదిద్దుకుంటే ఢిల్లీకి ఎదురే ఉండదు. ఇక, ఇషాంత్, మిశ్రా, పాల్ తదితరులతో బౌలింగ్ బలంగా ఉంది. సమష్టిగా రాణిస్తే ఫైనల్‌కు చేరడం ఢిల్లీకి అసాధ్యమేమి కాదు.

IPL 2019: DC vs CSK Qualifier-2 match today

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఉప్పల్ బెర్త్ ఎవరిదో? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: