నగరంలో కనిపించని బంద్ ప్రభావం

సాధారణంగా తిరిగిన ఆర్టీసి బస్సులు, ఆటోలు పలు చోట్ల బస్సులను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ మిత్ర పక్షాలు ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ సోమవారం నిర్వహించిన  బంద్ ఎటువంటి ప్రభావం చూపలేదు. ముఖ్యంగా నగరంలో అతి పెద్ద ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసి బస్సులు సాధారణంగానే రోడ్ల మీద తిరిగాయి. ఉదయం  సమయంలో మాత్రం  స్థానిక నాయకులు డిపోల ఎదుట  ఆందోళన నిర్వహించారు.  డిపో మేనేజర్లు  ముందుగానే తమ బస్సులకు రక్షణ […]

సాధారణంగా తిరిగిన ఆర్టీసి బస్సులు, ఆటోలు
పలు చోట్ల బస్సులను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

కాంగ్రెస్ మిత్ర పక్షాలు ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ సోమవారం నిర్వహించిన  బంద్ ఎటువంటి ప్రభావం చూపలేదు. ముఖ్యంగా నగరంలో అతి పెద్ద ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసి బస్సులు సాధారణంగానే రోడ్ల మీద తిరిగాయి. ఉదయం  సమయంలో మాత్రం  స్థానిక నాయకులు డిపోల ఎదుట  ఆందోళన నిర్వహించారు.  డిపో మేనేజర్లు  ముందుగానే తమ బస్సులకు రక్షణ కల్పించాలని కోరుతూ విజ్ఞప్తి చేయడంతో పోలీసులు వెంటనే డిపోల ముందు ఆందోళన నిర్వహిస్తున్న స్థానిక నాయకులను వెంటనే అరెస్టు చేయడంతో బస్సులన్నీ యథావిధిగానే రోడ్డు ఎక్కడంతో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కాచిగూడ డీవిఎం పరిధిలోని బర్కత్‌పురాలో డిపో పరిధిలో 56 బస్సులకు గాను 56 బస్సులు, దిల్‌షుక్‌నగర్ డిపో పరిధిలోని 102 బస్సులకు గాను 102 బస్సులు, కాచిగూడ డిపో పరిధిలోని 92 బస్సులకు గాను 89 బస్సులు, అదే విధంగా ముషీరాబాద్ డిపో -1 పరిధిలోని 71 బస్సులకు గాను, 69బస్సులు ముషీరాబాద్ డిపో – 2 పరిధిలోని 95 బస్సులకు 92 బస్సులను సాధారణ రోజుల్లో మాదిరిగానే తిప్పినట్లు ఆర్టిసి అధికారులు చెబుతున్నారు. కొద్ది మంది స్థానిక నాయకులు డిపోల ఎదుట ఆందోళన చేయడంతో రోజు వారీ సమయం కంటే బ స్సులు డిపోల నుంచి కొద్దిగా ఆలస్యంగా బయలు దేరినట్లు తెలిపారు.
అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం డిపోల నుంచి బయలు దేరిన బస్సులను మార్గ మధ్యలో కొందరు కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో కొంత సేపు వాటిని అక్కడ నిలిపివేసినా అనతరం యధావిధిగా బస్సులు నడిచాయి.
అదే విధంగా నగరంలోని అన్ని ఆటోలు బంద్‌లో పాల్గొనాలని గత కొద్ది రోజులుగా ఆటో యూనియన్ నాయకులు చెబుతున్నా ఆటోలు కూడా సాధారణ స్థాయిలోనే రోడ్ల మీద కనిపించాయి.
అయితే కొన్ని చోట్ల మాత్రం కొద్ది ఆటో యూనియన్ నాయకులు బంద్‌ లో పాల్గొనకుండా రోడ్ల మీద తిరుగుతున్న ఆటోలను అడ్డగించి అందులో తిరుగుతున్న ప్రయాణికులను దించివేయడంతో వాటిలో ప్రయాణించే వారు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఏది ఏమైన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కాంగ్రెస్ మిత్రపక్షాల ఆధ్వర్యంలో జరిగిన బంద్ ప్రభావం నగరంపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు.

Comments

comments

Related Stories: