రూ.5 లక్షల కోట్లు ఆవిరి

  రెండు రోజుల్లో తుడిచిపెట్టుకుపోయిన ఇన్వెస్టర్ల సంపద బడ్జెట్లో ప్రతిపాదనలు మార్కెట్లకు మింగుడుపడడం లేదు. సంపన్నులపై సర్ ఛార్జీలు పెంచడం, కంపెనీల్లో ప్రమోటర్ల వాటా తగ్గిస్తూ ప్రజల వాటా పెంచడం, బైబ్యాక్‌పై సర్‌చార్జీ పెంపు వంటివి ఇన్వెస్టర్లకు నచ్చలేదు. స్టాక్‌మార్కెట్‌కు ఊరట కల్గించే అంశాలు ఏమాత్రం లేకపోవడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో సోమవారం మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. 30 షేర్ల సెన్సెక్స్ ఓ దశలో 900 పాయింట్లు కోల్పోయి 38,605 పాయింట్ల కనిష్టానికి చేరింది. అయితే […] The post రూ.5 లక్షల కోట్లు ఆవిరి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రెండు రోజుల్లో తుడిచిపెట్టుకుపోయిన ఇన్వెస్టర్ల సంపద

బడ్జెట్లో ప్రతిపాదనలు మార్కెట్లకు మింగుడుపడడం లేదు. సంపన్నులపై సర్ ఛార్జీలు పెంచడం, కంపెనీల్లో ప్రమోటర్ల వాటా తగ్గిస్తూ ప్రజల వాటా పెంచడం, బైబ్యాక్‌పై సర్‌చార్జీ పెంపు వంటివి ఇన్వెస్టర్లకు నచ్చలేదు. స్టాక్‌మార్కెట్‌కు ఊరట కల్గించే అంశాలు ఏమాత్రం లేకపోవడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో సోమవారం మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. 30 షేర్ల సెన్సెక్స్ ఓ దశలో 900 పాయింట్లు కోల్పోయి 38,605 పాయింట్ల కనిష్టానికి చేరింది. అయితే ఆ తర్వాత స్వల్పంగా పుంజుకుని ఆఖరికి 793 పాయింట్ల నష్టంతో 38,720 పాయింట్లకు చేరింది. నిఫ్టీ కూడా 2.14 శాతం పతనమై 11,558 పాయింట్ల వద్ద ముగిసింది.

ముంబై: బడ్జెట్ అనంతరం మార్కెట్లు తీవ్రంగా స్పందిస్తున్నాయి. వరుసగా రెండు రోజులు సూచీలు భారీగా నష్టపోవడంతో దాదాపు రూ.5.55 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. సెన్సెక్స్ అత్యధికంగా 800 పాయింట్ల మేరకు నష్టపోవడం ఇన్వెస్టర్ల సంపద ఆవిరి కావడానికి కారణమైంది. బిఎస్‌ఇ లిస్టెట్ కంపెనీల మార్కెట్ మూలధనం(మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ. 5,55,707 కోట్లు కోల్పోయింది. జూలై 4న(గురువారం) మార్కెట్ మూలధనం రూ.1,53,58,075 కోట్లు ఉండగా, సోమవారం నాటికి రూ. 1,48,02,367 కోట్లకు పడిపోయింది. గత వారాంతం శుక్రవారం మార్కెట్ మూలధనం రూ.1,51,35,495 కోట్ల మూలధనం ఉంది.

నాలుగేళ్లలో ఇదే భారీ పతనం
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ సూచీల ఒక రోజు అతిపెద్ద పతనం నాలుగేళ్లలో ఇదేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక రెండు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు నష్టపోయింది. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో పాటు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎల్ అండ్ టి, బజాజ్ ఫైనాన్స్ లాంటి కీలక షేర్లు కుదేలవడంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. ఎన్‌ఎస్‌ఇ దిగ్గజాలలో బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ భారీగా 10 శాతం నష్టపోయింది. బజాజ్ ఫైనాన్స్, ఒఎన్‌జిసి, ఎన్‌టిపిసి, హీరోమోటార్స్, ఎస్‌బిఐ వంటి దిగ్గజ షేర్లు నష్లాలను చవిచూశాయి. ఒక్క యస్‌బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ లాభపడ్డాయి. బడ్జెట్‌తో పాటు అంతర్జాతీయ పరిమాణాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసాయి. అమెరికా ఉద్యోగ కల్పన, ఫెడ్ రేట్ల తగ్గింపు, క్రూడ్ ధరలు వంటి అంశాలు మార్కెట్లను నష్టాల్లోకి జారుకున్నాయి.

నష్టాలకు కారణాలు ఇవే..
1. స్టాక్ మార్కెట్లలో నమోదైన కంపెనీలలో పబ్లిక్ షేర్ హోల్డింగ్ వాటాను 25 శాతంనుంచి 35 శాతానికి పెంచాలని బడ్జెట్‌లో ప్రతిపాదించడంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నది. చాలా కంపెనీలు తమ పబ్లిక్ షేర్ హోల్డింగ్‌ను పెంచుకోవాల్సి వస్తుంది. ఎక్కువ ప్రమోటర్ల షేర్లను అమ్మకానికి పెట్టడం లేదా అదనపు ఈక్విటీలను జారీ చేయాల్సి రావడం వంటివి అంశాలు మార్కెట్ల పతనానికి కారణమయ్యాయని నిపుణులు పేర్కొంటున్నారు.
2. కంపెనీల బై బ్యాక్‌లపై 20 శాతం పన్నులను వసూలు చేయాలనే నిర్ణయం కూడా ప్రతికూల ప్రభావం చూపింది.
3. భారత్‌లో ట్రస్ట్‌లు లేదా ఎఒపి(అసోషియేషన్ ఆఫ్ పర్సన్స్) ద్వారా విదేశి పెట్టుబడులు అధికంగా జరుగుతాయి. అయితే అధిక సంపాదనల పన్నులపై సర్ చార్జీలను పెంచడంతో విదేశి ఫండ్స్‌పై ప్రభావం చూపింది.
4. బడ్జెట్ ప్రతిపాదనలను చాలా మంది మార్కెట్ ఎనలిస్టులు స్వాగతించినప్పటికీ ఇన్వెస్టర్ల అంచనాలను అందుకోలేకపోయింది. ఇన్వెస్టర్లు ఊహించిన దానికి విరుద్ధంగా ఆర్ధిక ఉద్దీపన ప్రణాళికలు లేక పోవడంతో మార్కెట్లు నష్టపోతున్నాయని విశ్లేకులు అంటున్నారు.
5. 2020 ఆర్ధిక సంవత్సరానికి గానూ ఈ బడ్జెట్ సరైన దిశలో ఉన్నప్పటికీ, అధిక ఆదాయ పన్ను ఇష్యూ, మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్ వంటి వాటిపై అధిక ఛార్జీలు వంటివి మార్కెట్లను నిరాశకు గురి చేశాయి.
6. రూపాయి 21 పైసలు బలహీనపడి 68.63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతేకాకుండా చమురు ధరలు పెరగడం కూడా రూపాయిపై ప్రభావం చూపుతున్నాయి.
7. దిగ్గజ ఐటి కంపెనీలు టిసిఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల త్రైమాసిక ఫలితాలను ఈ జులై 9, 12 తేదీల్లో విడుదల కానున్నాయి. అలాగే స్థూల ఆర్ధిక రంగంలోని ఐఐపి, సిపిఐ ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ నెల 12న వెల్లడి కానున్నాయి. రుతుపవనాల గమనం, గ్లోబల్ క్యూస్ వంటి విషయాలనూ ఇన్వెస్టర్లు గమనిస్తున్నారు. మరో రెండు నెలల్లో మార్కెట్లు కొంత సానుకూలత చూపించవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Investors lose Rs 5.61 lakh cr in last two trading sessions

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రూ.5 లక్షల కోట్లు ఆవిరి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.