పెట్టుబడి సాయం…

  ఈ నెల 7నాటికి 781.17కోట్లు రైతు ఖాతాల్లో జమ జూన్ 10 వరకు డిజిటల్ సంతకాలు పూర్తయిన పట్టాలకే ఖరీఫ్ పెట్టుబడి 7.36 లక్షల మంది రైతుల బ్యాంకు వివరాలు తీసుకోండి ఈ నెల 7 వరకు రూ.781.17 కోట్లు జమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి హైదరాబాద్: రైతుబంధు పెట్టుబడి సాయం ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు చేరేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె. జోషి అన్నారు. ఎన్నికల కోడ్, విధులు […] The post పెట్టుబడి సాయం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈ నెల 7నాటికి 781.17కోట్లు రైతు ఖాతాల్లో జమ

జూన్ 10 వరకు డిజిటల్ సంతకాలు పూర్తయిన పట్టాలకే ఖరీఫ్ పెట్టుబడి
7.36 లక్షల మంది రైతుల బ్యాంకు వివరాలు తీసుకోండి
ఈ నెల 7 వరకు రూ.781.17 కోట్లు జమ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి

హైదరాబాద్: రైతుబంధు పెట్టుబడి సాయం ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు చేరేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె. జోషి అన్నారు. ఎన్నికల కోడ్, విధులు ముగిసినందున రైతుల సమాచార సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జూన్ 10వ తేదీలోపు డిజిటల్ సంతకాలు పూర్తయిన పట్టాదారులకే ఎకరాకు రూ.5 వేలు అందుతుందన్నారు. అలాగే 2018 ఖరీఫ్, రబీ రైతుబంధు సొమ్ము అందని వారి వినతులను పరిగణనలోకి తీసుకోరాదన్నారు.

ఆ తరువాత వచ్చే వారికి ఖరీఫ్ సాయం ఉండదని స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం సిఎస్ రైతుబంధు, 2021 జనాభా లెక్కల సమీకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 3 నుండి బిల్లులు సమర్పించి రైతుల ఖాతాలకు సొమ్ము జమ చేశామన్నారు. ఈ నెల 7 వరకు 7.19 లక్షల పట్టా దారులకు 781.17 కోట్లను జమ చేసినట్లు వివరించారు. ఖరీఫ్ 2019 రైతు బంధు సాయానికి సిసిఎల్‌ఎ వద్ద ఉన్న 54.56 లక్షల పట్టాదారులకు సంబంధించి 1.40 కోట్ల ఎకరాలకు సంబంధించి వివరాలు సేకరించినట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా తెలిపారు.

గత రబీలో 47.19 లక్షల మంది రైతులకు సొమ్ము అందించామని, వారందరికీ ఇప్పుడు కూడా ఇస్తున్నట్లు చెప్పారు. అయితే కొత్తగా 7.36 లక్షల మంది రైతుల వివరాలను వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్ చేశామని, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుల వద్ద బ్యాంకుల వివరాలను తీసుకుని ఆప్‌డేట్ చేయాలన్నారు. ఆర్‌ఒఎఫ్‌ఆర్ పట్టా వివరాలను కమిషనర్ గిరిజన సంక్షేమ శాఖ వారి అనుమతితో వ్యవసాయ శాఖకు లిస్టు సమర్పించడానికి అంగీకరించారు. రైతు బంధు సాయాన్ని గివ్ ఇట్ అప్ ధరఖాస్తును ఎఇఒ లేదా, మండల వ్యవసాయాధికారికి సమర్పించాలన్నారు.

2021 జనగణన
2021 జనాభా లెక్కల సమీకరణకు సంబంధించి గ్రామ, పట్టణ రిజిష్టర్ల వివరాలను నవీకరించి సమర్పించాలని సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. 2011 జనాభా లెక్కల అనంతరం గ్రామ, పట్టణ రిజిష్ట్రర్లలో వివరాలను అప్ డేషన్ చేసి సమర్పించాలన్నారు. నవంబర్ 2010 నుండి డిసెంబర్ 2019 వరకు పట్టణ, మండల, గ్రామ, జిల్లా స్ధాయిలో ఏర్పడిన జ్యూరిడిక్షనల్ మారిన వివరాలను ఇవ్వాలన్నారు. పట్టణాలు, మున్సిపాలిటీల సమీపంలో ఏర్పడిన అర్భన్ అగ్లోమెరెషన్స్ వివరాలు పంపాలన్నారు. 2021 జనాభా లెక్కల సేకరణకు సంబంధించి ప్రిపరేటరీ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లను కోరారు. ఈ విషయమై కలెక్టర్లు నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్ధసారథి, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Investment Assistance to Farmers

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పెట్టుబడి సాయం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: