తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి : కెటిఆర్

KTRహైదరాబాద్ : హైదరాబాద్ కు మరో టెక్ దిగ్గజం వచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో వన్ ప్లస్ ఆర్ అండ్ డీ సెంటర్ ను టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వన్ ప్లస్ సిఇఒ పీట్ లూ కూడా పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కెటిఆర్ పారిశ్రామికవేత్తలను కోరారు. హైదరాబాద్‌లో వన్ ప్లస్ రూ.1000 కోట్లు పెట్టబడి పెట్టడం హర్షనీయమని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ సంస్థ ఏర్పాటుతో 3వేల ఉద్యోగాలు రావడం శుభ పరిణామమని ఆయన తెలిపారు. వన్ ప్లస్ మాన్యు ఫాక్చర్ యూనిట్ ను కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలి ఆయన కోరారు. తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తుందని కెటిఆర్ హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ అండ్ డి సెంటర్ ను హైదరాబాద్ లో ప్రారంభిస్తున్నామని వన్ ప్లస్ సిఇఒ పీట్ లూ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ అన్ని విధాల అనుకూలమైనదని పీట్ లూ చెప్పారు.

Invest In Telangana : TRS Working President KTR

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి : కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.