చిరంజీవి ఫోన్ చేయడంతో షాక్ అయ్యా

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ జంటగా యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సాహో’. యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో ‘సాహో’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌కు యూట్యూబ్‌లో అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా […] The post చిరంజీవి ఫోన్ చేయడంతో షాక్ అయ్యా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ జంటగా యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సాహో’. యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో ‘సాహో’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌కు యూట్యూబ్‌లో అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో హీరోహీరోయిన్లు ప్రభాస్, శ్రద్ధాకపూర్ విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

అద్భుతంగా ఫైట్స్ చేసింది…
ప్రభాస్‌ః శ్రద్ధాకపూర్ తొలిసారి యాక్షన్ మూవీ ‘సాహో’లో నటించింది. ఇప్పటివరకు ప్రేమ కథలు చేసిన ఆమె ఈ చిత్రంలో అద్భుతంగా ఫైట్స్ కూడా చేసింది. ఈ చిత్రం కోసం దక్షిణాది ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అద్భుతమైన స్పందన…
శ్రద్ధాః భారీ యాక్షన్ మూవీ ‘సాహో’. ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో చూస్తున్నారు. ఇక ఈ చిత్రం కోసం తెలుగు డైలాగులు నేర్చుకున్నాను. ‘సాహో’లో నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది.

స్క్రీన్‌ప్లే మీద దృష్టిపెట్టి…
ప్రభాస్‌ః అద్భుతమైన స్క్రీన్‌ప్లే ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ‘బాహుబలి’ తర్వాత నేను నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దానికంటే పెద్ద సినిమా తీయడం కష్టం కాబట్టి స్క్రీన్‌ప్లే మీద దృష్టిపెట్టి ఈ సినిమా చేశాం.

స్పెషల్ మూవీగా…
శ్రద్ధాః ఈ చిత్రం చేయడానికి వచ్చినప్పుడు ‘సాహో’ టీమ్ నాకు ఘన స్వాగతం చెప్పింది. ఈ చిత్రం కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఇంటికి వచ్చినట్లు అనిపించింది. నా కోసం స్పెషల్ ఫుడ్‌ను తెప్పించేవారు. నా కెరీర్‌లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుంది.

రెండవ చిత్రాన్నే ఇంత పెద్ద రేంజ్‌లో…
ప్రభాస్‌ః దర్శకుడు సుజిత్ చిన్న వయసులోనే ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించాడు. తన రెండవ చిత్రాన్నే ఇంత పెద్ద రేంజ్‌లో చేయడం విశేషం. ఈ సినిమా చేస్తున్నప్పుడు అతను ఎప్పుడూ నవ్వుతూ కనిపించేవాడు. ఏ రోజు కూడా అతను కోపంగా కనిపించలేదు. ఇక షూటింగ్‌లో తొలిరోజు కష్టమైన సీన్ చేశాం. ఈ సీన్‌ను సుజిత్ అద్భుతంగా తెరకెక్కించాడు. అప్పుడు నాకు అతనిపై పూర్తి నమ్మకం ఏర్పడింది.

137 కట్‌లతో ట్రైలర్…
ప్రభాస్‌ః సినిమా ప్రమోషన్‌లో ట్రైలర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ ట్రైలర్ కోసం 137 కట్‌లు చేశారు. ట్రైలర్ కోసం ఎంత కషపడ్డారో సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది.

హ్యాపీగా ఉన్నా…
శ్రద్ధాః బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌తో కలిసి నటించాలని చాలా మంది హీరోయిన్లు కోరుకున్నారు. కానీ అతనితో నటించే అవకాశం నాకు రావడంతో హ్యాపీగా ఉన్నాను. నేను ఈ స్క్రిప్టు విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. ప్రభాస్‌తో కలిసి నటించిన ఈ చిత్రంతో ఒకేసారి తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉంది.

హిందీలో డబ్బింగ్ చెప్పా…
ప్రభాస్‌ః ఈ చిత్రం కోసం హిందీలో నేనే డబ్బింగ్ చెప్పాను. నాకు హిందీ చదవడం, రాయడం వచ్చు. కానీ పెద్దగా మాట్లాడలేను. దీంతో ఈ సినిమా కోసం ఓ టీచర్‌ను పెట్టుకొని హిందీ మాట్లాడడం నేర్చుకున్నాను.

ఫైట్స్ అబ్బురపరుస్తాయి…
ప్రభాస్‌ః ఈ సినిమాలో యాక్షన్ సీన్ల కోసం భారీగా ఖర్చు పెట్టారు. అద్భుతమైన ఫైట్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు పనిచేశారు.

చక్కగా తీర్చిదిద్దాడు…
శ్రద్ధాః ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించడం కొత్త అనుభూతినిచ్చింది. దర్శకుడు సుజిత్ ఈ పాత్రను చక్కగా తీర్చిదిద్దాడు. నా క్యారెక్టర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.

అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్…
ప్రభాస్‌ః జిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది. అతను టీజర్ కోసం 80 లేయర్స్ చేయించాడు. అందుకే అంత మంచి సౌండ్ వచ్చింది. అతను పడిన కష్టం సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది.

చిరంజీవి ప్రశంసించారు…
ప్రభాస్‌ః ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి నాకు ఫోన్ చేసి ప్రశంసించారు. ఆయన ఫోన్ చేయడంతో షాక్ అయ్యాను.

‘బాహుబలి’కంటే ముందే చెప్పాడు…
ప్రభాస్‌ః ‘బాహుబలి’ చిత్రానికి ముందే దర్శకుడు సుజిత్ నాకు ఈ కథ చెప్పాడు. అతను ఈ చిత్రం ఎంతో కాలంగా ఎదురుచూశాడు. ఇక సాహో’ స్క్రీన్‌ప్లే మాత్రం గొప్పగా ఉండాలని ముందే ప్లాన్ చేసుకున్నాం.

Interview with Saaho Team

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చిరంజీవి ఫోన్ చేయడంతో షాక్ అయ్యా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: