ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నా

  శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా – సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కల్యాణి ప్రియదర్శన్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు… గ్యాంగ్‌స్టర్ కథ… ‘రణరంగం’ స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా శర్వానంద్ క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమాలో తను ఒక గ్యాంగ్‌స్టర్. ఈ గ్యాంగ్‌స్టర్ కథే ఈ చిత్రం. సినిమాలో భిన్నమైన భావోద్వేగాలు హైలెట్‌గా నిలుస్తాయి. గుర్తుండిపోయే […] The post ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా – సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కల్యాణి ప్రియదర్శన్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

గ్యాంగ్‌స్టర్ కథ…
‘రణరంగం’ స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా శర్వానంద్ క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమాలో తను ఒక గ్యాంగ్‌స్టర్. ఈ గ్యాంగ్‌స్టర్ కథే ఈ చిత్రం. సినిమాలో భిన్నమైన భావోద్వేగాలు హైలెట్‌గా నిలుస్తాయి.

గుర్తుండిపోయే పాత్ర…
ఈ సినిమాలో నా పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ఈ పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా నా కెరీర్‌లో ఈ పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే ఈ సినిమాలో లవ్‌స్టోరీ కూడా అంతే బాగా ఆకట్టుకుంటుంది.

మా డాడీ సలహాలిచ్చారు…
1990 కాలంలో జరిగే సంఘటనల సమాహారంగా ‘రణరంగం’ సినిమా నడుస్తుంది. నా పాత్ర కూడా 1990 కాలంలోనే వస్తుంది. అప్పటి కాలానికి తగ్గట్లుగానే నా పాత్ర తాలూకు గెటప్ ఉంటుంది. ఇక సినిమాలో నా గెటప్ హాఫ్ శారీ విషయంలో మా డాడీ కూడా నాకు కొన్ని సలహాలు ఇచ్చారు. అవి కూడా చాలా బాగా ఉపయోగపడ్డాయి.

చాలా నేర్చుకున్నా…
దర్శకుడు సుధీర్‌వర్మ దగ్గర చాలా నేర్చుకున్నా. స్క్రిప్ట్ మీద ఆయనకు ఫుల్ కమాండ్ ఉంటుంది. ఫస్ట్ ఆయన స్క్రిప్ట్ చెప్పినప్పుడే నాకు కథ చాలా బాగా నచ్చింది. ఆయనతో కలిసి పని చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది.

సహజంగా నటించారు…
ఈ సినిమా మొత్తం శర్వానంద్ పాత్ర చుట్టే తిరుగుతుంది. సినిమాలో ఆయన క్యారెక్టర్ రెండు షేడ్స్‌లో ఉంటుంది. రెండు షేడ్స్‌ను ఆయన బాగా పలికించారు. ముఖ్యంగా గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఆయన సహజంగా నటించారు. శర్వానంద్‌తో కలిసి నటించడాన్ని ఎంతో ఎంజాయ్ చేశాను.

అమ్మ హ్యాపీగా ఫీలయ్యారు…
– నేను మలయాళ అమ్మాయిని. చెన్నైలో పెరిగాను. నాకు మలయాళం, తమిళం వచ్చు. కానీ తెలుగులో హీరోయిన్‌గా సినిమాలు చేస్తున్నాను. నిజానికి నేను హీరోయిన్ అవుదామనుకోలేదు. కానీ అనుకోకుండా హీరోయిన్ అయ్యాను. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. తెలుగులో హీరోయిన్‌గా నటిస్తున్నానని చెప్పగానే అమ్మ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. నా తొలి చిత్రం తర్వాత ఇక్కడ మనుషులు ఎంత మంచివారో, ఇండస్ట్రీ ఎంత బాగుంటుందో అర్థం చేసుకున్నాను. అదే విషయాన్ని అమ్మతో కూడా చెప్పాను.

కష్టంగా అనిపించింది…
-మా నాన్న ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘మరక్కార్’ సినిమాలో నటించడం చాలా కష్టంగా అనిపించింది. నేను యాక్ట్ చేస్తున్నప్పుడు నాన్న నా గురించి ఏమీ అనలేదు. అయితే సినిమా పూర్తయిన తర్వాత ఓ దర్శకుడికి నటి నుంచి ఏం కావాలో అలాంటి మంచి ఔట్‌పుట్ ఇచ్చావని అన్నారు.

తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం నేను ఎక్కువగా మలయాళం, తమిళ్ సినిమాలే చేస్తున్నాను. తెలుగు సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఓ సినిమా చర్చల్లో ఉంది.

Interview with Kalyani Priyadarshan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: