అందరికీ కనెక్ట్ అవుతుంది

 Kalyan Ram

 

సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన కొత్త చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తాలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. ఈ సినిమా బుధవారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో కల్యాణ్ రామ్‌తో ఇంటర్వూ…

కథకు పూర్తి న్యాయం జరుగుతుందని…
సినిమాలో హీరో క్యారెక్టర్‌ను బట్టే ‘ఎంత మంచివాడవురా’ టైటిల్ పెట్టాం. మొదట దర్శకుడు ఈ సినిమాకు ‘ఆల్ ఈజ్ వెల్’ అని పెట్టారు. కానీ తెలుగుదనం ఉన్న టైటిల్ అయితేనే ఈ కథకు పూర్తి న్యాయం జరుగుతుందని డైరెక్టర్‌ని అడిగితే… ఆయన ఈ టైటిల్‌ను పెట్టారు.

ఏది నెగటివ్‌గా తీసుకోడు…
ఈ సినిమాలో హీరో ఏది నెగటివ్‌గా తీసుకోడు. చిన్నతనంలో అతని జీవితంలో జరిగిన ఓ సంఘటనతో అతను పూర్తి పాజిటివ్‌గానే మారతాడు. మిగతా వాళ్లలో కూడా పాజిటివ్‌నెస్‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాడు.

ఆ పాయింట్ హైలైట్‌గా…
మనుషులందరూ మంచివాళ్లు అనే పాయింట్‌ను ఈ సినిమాలో చూపిస్తున్నాము. అంటే నెగిటివ్ యాంగిల్‌ను దూరం చేయడమే బెస్ట్ అనే సెన్స్‌ను హైలైట్ చేస్తున్నాము.

అందుకే ఈ సినిమా చేశా…
సినిమాలో హీరో జీవితంలోకి విభిన్నమైన వ్యక్తులు ప్రవేశిస్తారు. వాళ్ల వల్ల అతని జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి? సంఘర్షణ ఏమిటి? అనేదే ఈ సినిమా.
గుజరాత్ సినిమా ‘ఆక్సిజన్’ ఆధారంగానే ఈ సినిమా కథ రాసుకున్నారు. ఆ సినిమాలోని భావోద్వేగాలు నాకు నచ్చాయి. మా దర్శకుడు ఆ సినిమా కథలో చేసిన మార్పులు విన్నాక ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.

ఈజీగా అనిపించింది…
సతీశ్ వేగేశ్న చాలా మంచి డైరెక్టర్. ఆయనతో పని చేయడం చాలా ఈజీగా అనిపించింది. నాకు ఆయన డైలాగ్స్ బాగా ఇష్టం. చాలా బాగా రాస్తారు.

పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలని…
ఏ సినిమా చేయబోతున్నాము అనే విషయాలను నేను, ఎన్టీఆర్ మాట్లాడుకుంటాము. ఇక నేను ఇలాంటి పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చేస్తే బాగుంటుందని అతను భావించాడు.

మంచి కథ ఉంది…
సంక్రాంతి రైతుల పండగ. అలాగే మా సినిమా వాళ్లకు కూడా సంక్రాంతి సీజన్ పెద్ద పండగ. ఎన్ని సినిమాలు వచ్చినా బాగుంటేనే ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తారు. మా సినిమాలో మంచి కథ ఉంది. ఆ పాజిటివ్‌నెస్ అందరికీ కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాము.

Interview with hero Kalyan Ram

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అందరికీ కనెక్ట్ అవుతుంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.