అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా పార్థీ గ్యాంగ్‌ అరెస్ట్

Interstate gang of Robbers

 

వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడిన నలుగురు అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా పార్థీ గ్యాంగ్‌ను బుధవారం సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన గ్యాంగ్ సభ్యుల నుండి సుమారు రూ.5 లక్షల విలువల గల 135 గ్రాముల బంగారు, 500 గ్రాముల వెండి ఆభరణాలు నాలుగు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించి సిపి రవీందర్ నిందితుల వివరాలు తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం, వీదిషా జిల్లా గులాంగంజ్ తాలుకా వన్ గ్రామానికి పెంచిన పెంటియపార్థీ, రాజేష్‌మోంగియా అలియాస్ రాజ, బాల నేరస్తుడు చోరీ సొత్తును కొనుగోలు చేసిన వ్యాపారస్తుడు నారాయణ సోనిలు ఉన్నారు. ప్రస్తుతం రాజేంద్రసింగ్ మోంగియా, చంగిరాలు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

నిందితులు నగరంలో మరోమారు చోరీ చేసేందుకు అవకాశం లభించకపోవడంతో పాటు వారి వద్ద ఉన్న డబ్బు ఖర్చు కావడం, వారు తిరిగి స్వస్థలాలకు వెళ్లేందుకు అవసరమైన డబ్బు వారి వద్ద లేకపోవడంతో నిందితులు డబ్బు నిమిత్తం చోరీ సొత్తును కొనుగోలు చేసే వ్యాపారి నారాయణ సోనికి వరంగల్‌కు పిలిపించుకొని చోరీ సొత్తును నారాయణ సోనికి అందజేసేందుకుగాను వరంగల్ నగరంలోని బులియన్ మార్కెట్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్నట్లుగా పోలీస్ అధికారులకు సమాచారం అందడంతో పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు సిసిఎస్ ఎన్స్‌పెక్టర్ రవిరాజ్, మట్టెవాడ ఇన్స్‌పెక్టర్ జీవన్‌రెడ్డిలు తమ సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా బంగారు ఆభరణాలను గుర్తించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారించగా తాము పాల్పడిన దొంగతనాలను పోలీసుల ఎదుట అంగీకరించారు.

నిందితులను సకాలంలో గుర్తించడంతో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిసిఎస్ ఎసిపి బాబురావు, వరంగల్ ఎసిపి నర్సయ్య, సిసిఎస్, మట్టెవాడ ఇన్స్‌పెక్టర్లు, రవిరాజ్, జీవన్‌రెడ్డి, రమేష్‌కుమార్, మట్టెవాడ ఎస్సై వెంకటేశ్వర్లు, సిసిఎస్ ఎఎస్సై వీరస్వామి, హెడ్‌కానిస్టేబుళ్లు ఇనాయత్ అలీ, జంపయ్య, కానిస్టేబుళ్లు విశ్వేశ్వర్, వంశీ, విజయ్‌కాంత్, మీర్ మహమ్మద్‌అలీ, ఐటికోర్ అనాటికల్ అసిస్టెంట్ సల్మాన్ కానిస్టేబుల్ శ్రవణ్‌లను సిపి రవీందర్ అభినందించారు.

Interstate gang of Robbers Arrested

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా పార్థీ గ్యాంగ్‌ అరెస్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.