అమ్మ ఒక పాత వస్తువా?

మనవరాలి పెళ్లి పనులు జరుగుతున్నాయి… బంధువులు తరలి వస్తున్నారు.. పెళ్లి కూతురు స్నేహితులు వచ్చి ఆ పిల్లతో సరసమాడుతున్నారు. కొందరు ఆట పట్టిస్తున్నారు. అంతా హడావిడిగా ఉంది. జీవమ్మకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ మనవరాలు అంటే ఎంతో ఇష్టం.. ఎందుకంటే ఆ పిల్లను చూస్తే ఆమెకు ఆమెనే చూసుకున్నట్టే ఉంటుంది. తన చిన్న తనం లో ఎలా ఉండేదో అలా ఉంది మనవరాలు.. ఎప్పుడు ఆ పిల్లను చూసి ఆనంద పడుతుంటుం ది. ఈ […] The post అమ్మ ఒక పాత వస్తువా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనవరాలి పెళ్లి పనులు జరుగుతున్నాయి… బంధువులు తరలి వస్తున్నారు.. పెళ్లి కూతురు స్నేహితులు వచ్చి ఆ పిల్లతో సరసమాడుతున్నారు. కొందరు ఆట పట్టిస్తున్నారు. అంతా హడావిడిగా ఉంది. జీవమ్మకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ మనవరాలు అంటే ఎంతో ఇష్టం.. ఎందుకంటే ఆ పిల్లను చూస్తే ఆమెకు ఆమెనే చూసుకున్నట్టే ఉంటుంది. తన చిన్న తనం లో ఎలా ఉండేదో అలా ఉంది మనవరాలు.. ఎప్పుడు ఆ పిల్లను చూసి ఆనంద పడుతుంటుం ది. ఈ పిల్ల ఆరు నెలల పిల్లగా ఉన్నప్పుడు.. వాళ అమ్మ అలిగి పుట్టింటికి వెళ్ళపోతే.. తాను ఆ పిల్లను పెంచి పెద్ద చేసింది. చిన్న తనంలో తన బాల్యం గురుంచి తనకు తన అమ్మమ్మ నానమ్మలు చెప్పిన కథలు అన్నీ చెప్పేది. ఆ పిల్లకు తనకు తెలిసిన ఎన్నో ఆటలు నేర్పింది. తాను ఆ పిల్లను చూసినప్పుడల్లా తనను తాను చూసుకున్నట్టు అనుకునేది… తన చిన్న తనంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆడపిల్లకు ఉండే స్వేచ్ఛ మాకు ఎక్కడిది… తన చిన్న తనంలో చదువుకోలేదు.. ఊహ తెలిసినప్పటి నుండి ఇంట్లో అమ్మకు సాయంగా ఉండేది. వంట పని ఇంటి పని అన్నింటిలో తర్ఫీదు పొందింది.

ఊహ తెలిసీ తెలియక ముందే జీవితం ఇదీ అని గుర్తెరిగే లోపు పెళ్లి.. భర్త.. పిల్లలు.. అలా మొదలైన జీవితం.. సాగుతునే ఉంది.. ఆరు మంది కొడుకులు.. కడుపులో పిల్ల చంకలో పిల్ల .. చేతిలో పిల్ల అన్నట్టు సాగింది జీవితం. పిల్లల పెంపకం పెళ్లిళ్లు.. పెద్ద కోడలు వచ్చినప్పటి నుండి మెల్లమెల్లగా తన ప్రాధాన్యత తగ్గింది. పెద్ద కోడలు తన నుండి సంసారం బాధ్యతలు చేతిలోకి తీసుకుంది. భర్త ఉన్నంత వరకు తన పెత్తనం నడిచింది.. భర్త సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం వెళ్లిపోయాడు.. భర్త పోయినప్పటి నుండి తన జీవితంలో ఒక్కొక్కటి వెళ్లిపోతూ వచ్చాయి. తనకు తోచక కొన్నాళు కూలి పనికి వెళ్ళేది. ఆ వచ్చిన కూలి మనవళ్ళు మనవరాళ్లు అవసరాలకు ఇచ్చేది తన కోసం ఏదీ దాచుకోలేదు.. భర్తది గవర్నమెంట్ ఉద్యోగం ఏమీ కాదు.. ఆమెకు వయసు పెరుగుతోంది చూపు మందగిస్తోంది.. ఒకటి రెండు సార్లు శుక్లాల ఆపరేషన్ చేయించారు..

ఆరుగురు కోడళ్ళు పక్కపక్కనే ఉంటారు గాని నెలకు ఒకరు తన బాధ్యత చూసుకుంటారు. ప్రేమ అనేది ఆమె జీవితంలో లేదు.. ఆమెను ఎవ్వరు ప్రేమగా చూసుకుంటారు. ఎవరైనా ప్రేమను చూపిస్తారు అని ఆమె ఎప్పుడూ ఎదురు చూడలేదు తాను జీవితమంతా ప్రేమను పంచిందే కాని ఎప్పుడూ ప్రేమను పొందలేదు.. కొడుకులకు అమ్మ అంటే ఇష్టమే గాని .. వాళ్ళ పనుల బాధ్యతలు వాళ్ళవి.. ఎప్పుడన్నా చిన్న కోడలు వచ్చి పలకరించి పోతుంటాడు. ఎందుకంటే వాడు కాస్త దూరంగా ఉంటాడు కాబట్టి.. ఎప్పుడన్నా వచ్చి కాస్త ప్రేమ ప్రదర్శిస్తుంటాడు. అంతకు మించి ఎ వ్వరూ తనతో మాట్లాడరు… తను ఎందుకు బతుకుతుందో అర్ధం కాని పరిస్థితి.. ప్రతి రోజు చావు వస్తే బాగుండు అని.. పడుకునేముందు దేవుడా ఇదే నా చివరి నిద్ర కావాలి అనుకుంటుంది. కానీ దేవుడు తనకా అవకాశాన్ని ఇవ్వడం లేదు..

అప్పుడప్పుడు కోడళ్ళ సూటి పోటి మాటలు.. నేను అంత వయసు వరకు బతకను అంటారు. అంటే నేను దేవుడు పిలిచిన కూడా వెళ్ళడం లేదా.. నేను కావాలని బతుకుతున్నానా.. అస్సలు పుట్టుక చావు మనిషి చేతుల్లో ఉంటాయా? పుట్టుక లేకపోయినా చావు ఉంటే ఎంత బాగుండు ఒక వేళ ఆత్మహత్య చేసుకోవాలన్నా.. పిల్లలకు అవమానం వాళ్ళలో వాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి. సమాజం వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకుంటుంది. అందుకే దేవుడు పిలిచినప్పుడే పోదాము అని సరిపెట్టుకుంది. పిల్లలను కని.. వారిని పెద్ద చేసి పెళ్లళ్ళు చేయడంతో అమ్మగా నా పాత్ర అయిపోయింది. ఎందుకు ఉండాలి నేను.. కన్న పిలల్లే ఇంకా చనిపోలేదు ఏమిటి అని చూసేంత దుస్థితికి చేరుకోకూడదు.. మొన్న ముది మనవరాలు అనింది అందరి అమ్మమ్మలు నానమ్మలు చనిపోతున్నారు నువ్వు ఎందుకు చనిపోలేదు.. అని అమాయకంగా

అడిగింది. అలా అడగడాన్ని విన్న కోడళ్ళు ఎంతలా నవ్వుకున్నారో అలాంటి సంఘటనలు ఆమె జీవితంలో కో కొల్లలు… నాదేం తపు ఉంది అనుకుంది.. నిజమే ఒక వయసు వచ్చినప్పటికి చావు రాకపోతే జీవితం అంత నరకం ఉండదు అ ని తాను ఎన్ని సార్లు అనుకుందో .. కనీసం తనతో మాట్లాడే వాళ్ళు కూడా లేరు.. ఎందుకు తనతో మాట్లాడరు.. తన కడుపున పుట్టిన పిల్లలకు చిన్న తనంలో వాళ్ళకి ఎన్ని మాటలు నేర్పింది.. తన వద్ద మాటలు నేర్చుకున్న వారు.. ఒక కొడుకు అన్నం తినక పోతే తాను ఎంత అల్లాడేది.

ఎవ్వరికి అనారోగ్యంగా ఉన్నా తాను ఎంత తపించేది. ఇన్ని సేవలు చేసి పెంచి పోషించినా కూడా ఎందుకు దూరం పెట్టారు.. మూడు అంతస్తుల డాబాలో ఒక మూల చిన్న రూము తనకు కేటాయించారు. కుక్కిలి మంచం.. దోమతెర.. నీళ్ళకుండ తాగడానికి ఓ చెంబు గ్లాసు. అన్నం తినే ప ళ్లెం ఇవీ ఆమె ఆస్తులు.. తన బట్టలు తానే ఉతుక్కోవాలి.. ఎవ్వరు ముట్టుకోను కూడా ముట్టుకోరు. తనను ఒక అంటరాని వస్తువుగా చూస్తుంటారు.

ప్రస్తుతం లోకి వస్తే జీవమ్మ తన రూపంలో ఉన్న మనవరాలు పెళ్లి చూడాలని ఉబలాట పడుతోంది.. వారం రోజులుగా తన ఒంట్లో శక్తి సన్న గిల్లుతున్నట్టుగా అనిపించింది. దేవుడు మనవరాలి పెళ్లి ఉంచితే బాగుండు అని అనుకుంది. మనవరాలిని పెళ్లి కూతురును చేస్తే చూడాలని ఆశ పడింది. ఊర్లనుండి బంధువులు ఎక్కువ రావడంతో జీవమ్మను అక్కడి నుండి వేరే ఇంటికి తరలిద్దామని కోడళ్ళు పథక రచన చేశారు. వాళ్ళ భర్తలకు చెప్పి జీవమ్మ ఉంటున్న రూములోనే పెళ్లి కూతురును చేసే కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుంది అని ఒప్పించి ఆమెను వాళ్ళ ఇంటికి దూరంగా ఉన్న పాత సామానులు వేసుకునే గోడవున్ లాంటి ప్రదేశానికి మార్చాలని అనుకున్నారు… జీవమ్మకు ఈ విషయం తెలిసింది… తాను ఏనాడు కూడా ఇది కావాలి అని ఎవ్వరిని అడిగింది కాదు.. ఎవ్వరు ఏది చెపితే.. అది పాటించింది ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంది.. ఇప్పుడు కూడా తాను ఎదురు చెప్పలేదు కానీ మనవరాలిని పెళ్లి కూతురుగా చూసుకోవాలనే కోరిక విపరీతంగా ఉంది.. తనను అక్కడి నుండి ఇక్కడికి ఎవరు తీసుకుని వస్తారు.. తాను వంటరిగా నడవలేదు.. కొంత దూరం అయితే ప్రయత్నం చేస్తుంది గాని అంత దూరం నడవాలంటే పక్కన మనిషి ఉండాలి.. నన్ను గుర్తు పెట్టుకొని ఎవ్వరు తోడుకుని వస్తారు. ఇక్కడే ఉంటే.. పెళ్లి కూతురు అయిన మనవరాలిని కంటారా చూసుకునే దాన్ని కదా అనుకుంది..

ఒక రోజు ముందే జీవమ్మను కుక్కిలి మంచంతో సహా పాత సామాన్లు పడేసే రూముకు తీసుకొని వెళ్లి వదిలేశారు. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. పాత సామాన్లు వాడి పడేసిన మంచాలు.. కాళ్ళు విరిగిపోయిన కుర్చీలు.. ఇలా అన్నీ ఒకప్పుడు వాడి పడేసినవే.. జీవమ్మతో సహా.. పక్కనే మురికి కాలువా.. అందులో పందులు పొర్లాడినప్పటినుండి దుర్ఘంధం వస్తోంది. పెద్ద పెద్ద దోమలు.. గుడ్డి దీపం.. ముందు రోజు వేళకు ఆహారం మాత్రం తీసుకువచ్చారు.. మనవరాలు మాత్రం నానమ్మ ఎక్కడ అని రెండు మూడు సార్లు అడిగింది. ఉందిలే పక్కనే వేరే రూములో అని చెప్పారు.. ఆ రోజు ఎండ తీవ్రంగా ఉంది.. జీవమ్మ నీరసించి పోయింది. సాయంత్రం నాలుగు అవుతోంది.. నోరు పిడచ కొట్టుకుని పోతోంది. ఎవ్వరన్నా ఇటు వైపు వస్తారా అని ఎదురు చూసింది. మెల్లగా కళ్లు మూత పడుతున్నాయి. కళ్ళలో తన భర్త కనిపిస్తున్నాడు రా రా అని పిలుస్తున్నాడు.. ఆయన పోయినప్పటినుండి ఒక్క సారి కూడా తనకి కలలో కూడా కనిపించని వ్యక్తి ఈ రోజు కలలో కనిపించి రమ్మని పిలుస్తుండటంతో ఆమె మనసు ఆనంద పడుతోంది గాని ఒక పక్క మనవరాలిని.. తాను చిన్న తనంలో ఎలా ఉండేదో అలా ఉండే మనవరాలిని పెళ్లి కూతురుగా చూసుకోలేకపోయానే అనే అసంతృప్తి ఒక పక్క.

ఇక తనకు ఓపిక లేదు.. ఎక్కడి నుండో పిలుపు.. ఇప్పుడు భర్త తనకు స్పష్టంగా కనిపిస్తున్నాడు.. పెళ్లి చేసుకొని తనను తన ఇంటికి తీసుకు వచ్చిన భర్త సంసారంతో సహా అన్నీ తానై తనకు నేర్పిన భర్త.. మళ్ళీ చేయందుకున్నాడు.. రా అని పిలుచుకు వెళుతున్నాడు.. ఆప్పుడు జీవమ్మ తన భర్త భుజం మీద తల వాల్చింది. అతను మెల్లగా నడిపించుకుపోతున్నాడు.. మరో ప్రపంచంలోకి.. మరో లోకంలోకి మళ్ళీ తిరిగి కూడా చూడని ఈ లోకాన్ని వదిలేసి. ఆమె వెళ్లి పోయింది. పెళ్లి కూతురుగా ముస్తాబు అయినా మనవరాలు నానమ్మను వెతుక్కుంటూ వచ్చింది. తలుపు తీసి చూస్తే జీవమ్మ కళ్ళు నిర్జీవంగా.. శూన్యంలోకి చూస్తూ… మనవరాలు కుప్పకూలిపోయి గుండెలు అవిసేలా ఏడుస్తోంది.. తాను కూడా ఎప్పుడో ఒక సారి ఇలా నానమ్మలా అనుకుంది.

international mothers day 2019

  8500457122

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అమ్మ ఒక పాత వస్తువా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.