ర్యాగింగ్ కలకం.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

  మహబూబ్ నగర్ : కళాశాలల్లో ర్యాగింగ్ భూతం విస్తరిస్తుంది. తాజాగా మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ కలకం రేపింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సంతోష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీనియర్స్ ర్యాగింగ్ చేసినందుకు అవమాన భారంతోనే సంతోష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. దీంతో అతడ్ని వెంటనే చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహబూబ్ నగర్‌లోని ప్రతిభా కాలేజీలో సంతోష్ నాయక్ […] The post ర్యాగింగ్ కలకం.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మహబూబ్ నగర్ : కళాశాలల్లో ర్యాగింగ్ భూతం విస్తరిస్తుంది. తాజాగా మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ కలకం రేపింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సంతోష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీనియర్స్ ర్యాగింగ్ చేసినందుకు అవమాన భారంతోనే సంతోష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. దీంతో అతడ్ని వెంటనే చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహబూబ్ నగర్‌లోని ప్రతిభా కాలేజీలో సంతోష్ నాయక్ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇంటర్‌లో చేరినప్పటి నుంచి సీనియర్లు వేధింపులకు గురిచేస్తున్నారు.

ఈ ర్యాగింగ్ తీవ్రస్థాయి దాల్చడంతో భరించలేకపోయాడు. నిత్యం సీనియర్లు తీవ్ర స్థాయిలో దూషించడం, అసభ్య పదజాలంతో నిందిస్తుండడంతో మనస్తాపానికి గురైయ్యాడు. కొద్ది రోజులక క్రితం సంతోష్ నాయక్ తన స్వగ్రామం అయిన తిమ్మాజిపేట మండలం ఆర్సి తండా వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సంతోష్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాలేజీలో సీనియర్లు ర్యాగింగ్ చేస్తుండడం వల్లే తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులకు వివరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. అంతేకాక సీనియర్ల ర్యాగింగ్ విషయం చాలా సార్లు కళాశాల యాజమాన్యానికి వివరించినా, వారు పట్టించుకోలేదని విద్యార్థి సంతోష్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Inter Student Suicide Attempt at Mahabubnagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ర్యాగింగ్ కలకం.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: