యువకుడి వేధింపులకు ఇంటర్ విద్యార్థిని బలి

దామరచర్ల : ప్రేమ పేరుతో ఓ యవకుడు వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపినా వివరాల ప్రకారం… దామరచర్ల మండల కేంద్రానికి చేందిన కుర్రపిడత శిరీష(17) బొత్తలపాలెంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. అదే గ్రామానికి చెందిన నిమ్మల సతీష్ ఆమెను ప్రేమ పేరుతో నిత్యం వేధించేవాడు. ఈ విషయాన్ని శిరీష తల్లిదండ్రులకు తెలియచేయగా ఆమె తండ్రి సతీష్‌ను పలుమార్లు తమ బిడ్డను వేధించవద్దని […] The post యువకుడి వేధింపులకు ఇంటర్ విద్యార్థిని బలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

దామరచర్ల : ప్రేమ పేరుతో ఓ యవకుడు వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపినా వివరాల ప్రకారం… దామరచర్ల మండల కేంద్రానికి చేందిన కుర్రపిడత శిరీష(17) బొత్తలపాలెంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. అదే గ్రామానికి చెందిన నిమ్మల సతీష్ ఆమెను ప్రేమ పేరుతో నిత్యం వేధించేవాడు. ఈ విషయాన్ని శిరీష తల్లిదండ్రులకు తెలియచేయగా ఆమె తండ్రి సతీష్‌ను పలుమార్లు తమ బిడ్డను వేధించవద్దని హెచ్చరించాడు.

అయినప్పటికీ సతీష్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మంగళవారం శిరీష కాలేజీకి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ప్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా శిరీష ప్యాన్‌కు వివేలాడుతూ విగతజీవిగా కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు. తమ కూతురు శిరీషకు మేనల్లుడుతో వివాహం నిశ్చయమైందని, మే నెలలో వివాహం జరగవలసి ఉందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. నిమ్మల సతీష్ వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని వారు ఆరోపించారు.

తండ్రి కుర్రపిడత శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమేదు చేసి,దర్యాప్తు జరుపుతున్నట్టు వాడపల్లి ఎస్‌ఐ నర్సింహ్మరావు తెలిపారు. శిరీష మృతదేహానికి మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో పోస్టమార్టం నిర్వహించిన అనంతరం ఆమె తల్లిదండ్రులకు అప్పగించినట్టు ఎస్‌ఐ వెల్లడించారు. శిరీష అంత్యక్రియలు బుధవారం సాయంత్రం దామరచర్లలో నిర్వహించారు. ఈ ఘటనలో నిందితుడైన నిమ్మల సతీష్ పరారీలో ఉన్నాడు.

Inter Student Commits Suicide in Nalgonda District

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post యువకుడి వేధింపులకు ఇంటర్ విద్యార్థిని బలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.