ఎడపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

నిజామాబాద్‌ : ఎడపల్లి మండల పరిధిలోని ఏఆర్‌పీ క్యాంప్‌లో గురువారం రాత్రి ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన గోపాల కృష్ణ కుమార్తె వెన్నెల(18) ఇంటర్ చదువుతోంది. గురువారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో వెన్నెల రెండు సబ్జెక్టులు తప్పింది. దీంతో గురువారం రాత్రి పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు తక్షణమే వెన్నెలను నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున  మృతిచెందినట్లు ఎడపల్లి ఎస్ఐ రామునాయుడు […] The post ఎడపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నిజామాబాద్‌ : ఎడపల్లి మండల పరిధిలోని ఏఆర్‌పీ క్యాంప్‌లో గురువారం రాత్రి ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన గోపాల కృష్ణ కుమార్తె వెన్నెల(18) ఇంటర్ చదువుతోంది. గురువారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో వెన్నెల రెండు సబ్జెక్టులు తప్పింది. దీంతో గురువారం రాత్రి పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు తక్షణమే వెన్నెలను నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున  మృతిచెందినట్లు ఎడపల్లి ఎస్ఐ రామునాయుడు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఆయన చెప్పారు. పోస్టుమార్టం కోసం వెన్నెల మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. వెన్నెల మృతితో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది.

Inter Student Commits Suicide at Edapally

The post ఎడపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: