ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

TS Inter Boardహైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోర్డు ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. రీవెరిఫికేషన్/రీకౌంటింగ్ కు మరో రెండు రోజులు గడువు పెంచింది. ఈ నెల 25తో గడువు ముగియనుండగా తాజా నిర్ణయంతో 27 వరకు విద్యార్థులు రీవెరిఫికేషన్/రీకౌంటింగ్ కు అప్లై చేసుకునే అవకాశం ఏర్పడింది. అలాగే సప్లిమెంటరీ ఫీజు  చెల్లింపునకు కూడా రెండు రోజుల గడువు పెంచింది. వెబ్ సైట్ పనిచేయడం లేదని విద్యార్థులు,తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనకు దిగడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌ను ఉచితంగా చేయాలని విద్యార్థి డిమాండ్ సంఘాలు డిమాండ్ చేసినప్పటికీ అందుకు అధికారులు అంగీకరించలేదు. రీ వెరిఫికేషన్‌కు రూ.600, రీ కౌంటింగ్‌కు రూ.100 ఫీజు చెల్లించాలని స్పష్టంచేశారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు ప్రయత్నించినప్పటికీ లింక్ ఓపెన్ కావడం లేదు. అటు ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో విద్యార్థుల్లో మరింత ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఇంటర్ బోర్డు అధికారులు. బోర్డు నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Inter Board Extends Paper Revaluation, Supplementary fees Dates

The post ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.