నిమజ్జనం రేపు

మన తెలంగాణ/హైదరాబాద్ : కశ్మీర్ ఘటనతో ఈనెల 12న వినాయక నిమజ్జన వేడుకలలో ఉగ్రకుట్ర జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల ముందస్తు హెచ్చరిక నేపథ్యం లో హైదరాబాద్‌లో ఉగ్రమూలాలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ, పోలీసులు ప్రత్యేక నిఘా సారిస్తున్నారు. తాజా గా కశ్మీర్ ఎనిమిది మంది ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన సానుభూతి పరులు పట్టుబడటంతో కేంద్ర నిఘా వర్గాలు దేశవ్యాప్తంగా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. ఇందులో భాగంగా నగరంలోని […] The post నిమజ్జనం రేపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్ : కశ్మీర్ ఘటనతో ఈనెల 12న వినాయక నిమజ్జన వేడుకలలో ఉగ్రకుట్ర జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల ముందస్తు హెచ్చరిక నేపథ్యం లో హైదరాబాద్‌లో ఉగ్రమూలాలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ, పోలీసులు ప్రత్యేక నిఘా సారిస్తున్నారు. తాజా గా కశ్మీర్ ఎనిమిది మంది ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన సానుభూతి పరులు పట్టుబడటంతో కేంద్ర నిఘా వర్గాలు దేశవ్యాప్తంగా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. ఇందులో భాగంగా నగరంలోని ఐఎస్‌ఐఎస్, ఉగ్రభావజాలంపట్ల ఆకర్షితులైన వారి కదలికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని పలు అనుమానస్పద ప్రాంతాలలో పోలీసులు నాకాబందీతో పాటు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు ఆధారాలు సేకరించిన అనంతరం సదరు యువకులను అదుపులోకి తీసుకోవాలని అటు ఎన్‌ఐఎ, ఇటు ప్రత్యేక పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

హైదరాబాద్ నగరంలోమాడ్యుల్స్, స్లీపర్ సెల్‌పై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టిసారిస్తున్నాయి. నగరంలోని ఓ సామాజిక వర్గానికి చెందిన యువతను ఐసిస్ పట్ల ప్రభావితం చేసేందుకు సామాజిక మాధ్యమాల ఆయుధంగా చేసుకున్నట్లుగా ఎన్‌ఐఎ అధికారులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాద భావాజాలాలనికి అకర్షితులవుతున్నారనే అనుమానంతో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఉగ్రప్రభావిత ప్రాంతాలలో రహస్యంగా విచారణ చేపడుతున్నారు. కశ్మీర్ పునర్విభజన కారణంగా హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ పాతబస్తీలోని ప్రత్యేకంగా పోలీస్ పికెట్‌లను సైతం ఏర్పాటు చేసింది. ఉగ్రవాద భావాజాలం పట్ల ఆసక్తి చూపుతూ సంబంధిత వ్యక్తులతో సంభాషణలు సాగిస్తున్నారన్న పక్కా ఆధారాలతో ఎన్‌ఐఎ ధికారులు విచారిస్తున్నారన్నది సమాచారం.ఉగ్ర కదలికలపై నిఘా వర్గాల సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోన్న విషయం విదితమే. తాజాగా కేంద్ర నిఘావర్గాల హెచ్చరికల కారణంగా హైదరాబాద్‌లోని ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. షాయిన్‌నగర్, పహడి షరీఫ్, అభిన్‌పురాల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదివరలో బీహార్‌లోని బౌద్ధగయ, ఉత్తరాఖండ్‌లోని అర్ధ కుంభమేళలో పేలుళ్లకు కుట్ర పన్నిన వారి సన్నిహితుల కదలికలపై నిఘా సారించినట్లు తెలియవచ్చింది. ముఖ్‌యంగా నగరంలోని స్లీపర్ సెల్, మాడ్యువల్స్ కదలికలపై నిఘా సారిస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఐసిస్ పట్ల ఆకర్షితులైన వారి జాబితాను పరిశీలిస్తున్నారు. కాగా పాతబస్తీలో కొందరు యువకులు కనిపించకుండా పోయారని, వారిపై పోలీసు స్టేషన్లలో ఏలాంటి కేసులు నమోదు కాలేదు. ఈక్రమం లో అజ్ఞాతంలో ఉన్న వారి పేర్లను సేకరిస్తున్నారు. వీరు ఎక్కడు ఉన్నా రు? ఉగ్రవాదం పట్ల ఆకర్షితులై ఆయా సంస్థల్లో పనిచేస్తున్నారా? అన్న కోణంలో ఎన్‌ఐఏ దర్యాప్తు సాగిస్తోంది. గతంలో సిమిలో పనిచేసిన వారు ఇతర ఉగ్రవాద సంస్థలలో కీలకంగా పనిచేస్తున్నారని ఎన్‌ఐఏ అ నుమానిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉగ్రవాద సాహిత్యా న్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ నగరంలోని ఓ సామాజిక వర్గానికి చెందిన నిరుపేదలకు ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లీంచేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించినట్లు సమాచారం.

 intelligence unit Warns Terror Attack in Vinayaka immersion

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నిమజ్జనం రేపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: