వీడియోగేమ్స్‌తో నిద్రలేమి…

  ప్రతి ఇంట్లో స్మార్ట్‌ఫోన్‌లో వీడియోగేమ్స్ ఆడే పిల్లలే ఉంటారు. వీడియోగేమ్స్ మెదడు చురుగ్గా ఉండేందుకు ఉపయోగపడతాయి, లాజికల్ మైండ్‌ని అభివృద్ధి చేస్తాయి. దీంతోపాటు రాత్రిళ్లు నిద్రలేమితో బాధపడేట్లు చేస్తాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ హెల్త్ సెంటర్ వారు ఓ సర్వే చేశారు. ఇందులో 965 మంది పాల్గొన్నారు. దాదాపు రాత్రి ఆలస్యంగా పడుకోవటం, పడుకున్నా సరిగా నిద్రపట్టకపోవటం లాంటి లక్షణాలు అతిగా వీడియోగేమ్స్ ఆడటం వల్ల వస్తాయట. దాదాపు 36 శాతం మంది […] The post వీడియోగేమ్స్‌తో నిద్రలేమి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రతి ఇంట్లో స్మార్ట్‌ఫోన్‌లో వీడియోగేమ్స్ ఆడే పిల్లలే ఉంటారు. వీడియోగేమ్స్ మెదడు చురుగ్గా ఉండేందుకు ఉపయోగపడతాయి, లాజికల్ మైండ్‌ని అభివృద్ధి చేస్తాయి. దీంతోపాటు రాత్రిళ్లు నిద్రలేమితో బాధపడేట్లు చేస్తాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ హెల్త్ సెంటర్ వారు ఓ సర్వే చేశారు.
ఇందులో 965 మంది పాల్గొన్నారు. దాదాపు రాత్రి ఆలస్యంగా పడుకోవటం, పడుకున్నా సరిగా నిద్రపట్టకపోవటం లాంటి లక్షణాలు అతిగా వీడియోగేమ్స్ ఆడటం వల్ల వస్తాయట. దాదాపు 36 శాతం మంది పిల్లలు నిద్రలేమితో బాధపడుతున్నారని సర్వే చెబుతోంది. ఒక్కసారి వీడియోగేమ్‌కి అడిక్ట్ అయితే దాన్నుంచి బయటికి రావాలంటే పెద్దలకే కష్టం. అలాంటిది పిల్లలు అంత త్వరగా వీడియోగేమ్స్‌కి దూరంగా ఉండలేరు. వీడియోగేమ్స్‌కి బానిసైన వారు ఆటలోకి అడుగెట్టాక కనీసం గంటన్నర పాటు ఆడతారని సర్వే చెబుతోంది. అందుకే ఈ అడిక్టివ్ బిహేవియర్ నుంచి పిల్లలను దూరంగా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవుట్‌డోర్ గేమ్స్‌ని పిల్లలతో వీలైనంత వరకూ ఎక్కువగా ఆడించాలి. అప్పుడే వారికి వీడియోగేమ్స్‌కి అడిక్ట్ కాకుండా ఉంటా రని వారు సూచిస్తున్నారు.

Insomnia with videogames

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వీడియోగేమ్స్‌తో నిద్రలేమి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.