ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై కోర్టులో విచారణ

High Courtహైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై గురువారం హైకోర్టులో విచారణ కొనసాగింది. 5,100 రూట్లను ప్రైవేటీకరణ చేస్తూ తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు ప్రభుత్వం అందించింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఈనెల 18వ తేదీకి విచారణను వాయిదా వేసింది. అటు ప్రభుత్వం కానీ, ఇటు ఆర్టీసీ కార్మికు సంఘాలు కానీ మెట్టుదిగకపోవడంతో సమ్మె చిక్కుముడిగా మారింది. సమ్మె కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులను ఇరుపక్షాలు పట్టించుకోకవడంతో సామాన్య ప్రజలు అష్టకష్టాల పాలువుతున్నారు. సమ్మె పిటిషన్ విచారణ అనంతరం వేతనాలపై విచారణ చేపడుతామని హైకోర్టు స్పష్టం చేసింది. కార్మికుల వేతనాలకు సంబంధించిన పిటీషన్ పై విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేస్తు కోర్టు నిర్ణయం తీసుకుంది.

Inquiry In High Court On Privatization of RTC Routes

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై కోర్టులో విచారణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.