ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువు మృతి

Government Hospital

 

నిజామాబాద్ : కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి చెందింది. భాదితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కమ్మర్‌పల్లిలోని గాంధీనగర్ కాలనీకి చెందిన రజిత (20)కు గత ఆదివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కమ్మర్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులు రజితను తీసుకువచ్చారు. ప్రసవానికి మూడు రోజుల సమయం ఉందని సిబ్బంది చెప్పడంతో రజితను తిరిగి ఇంటికి తీసుకేళ్లారు. గురువారం నొప్పులు రావడంతో రాత్రి 7 గంటలకు మళ్ళి కమ్మర్‌పల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. కానీ ఆసుపత్రికి వచ్చే సరికి ఆయ తప్ప ఆసుపత్రిలో సిబ్బంది ఎవరూ లేరు.

ఆ సమయంలో డ్యూటిలో ఉండవలసిన స్టాఫ్ నర్సు ముందుగానే వెళ్లి పొయింది. దీంతో రజిత నొప్పులతో దాదాపు గంట పాటు వేచి ఉన్నాక మరో స్టాఫ్ నర్సు జ్యోతి వచ్చి డాక్టర్ అంబికకు ఫోన్‌లో సమాచారం అందించింది. పరిస్థితి విషమంగా ఉందని, కడుపులో శిశువు నుండి ఎలాంటి శబ్దం లేదని చెప్పడంతో రజితను 104 అంబులెన్స్‌లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రికి పంపారు. అక్కడి ప్రైవెటు స్థానిక సెంటర్‌లో పరీక్షలు నిర్వహించాక శిశువు కడుపులోనే మృతి చెందిందని చెప్పారు. దీంతో శుక్రవారం రజిత బంధువులు వచ్చి ఆసుపత్రిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ గడ్డం స్వామి చేరుకొని సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయనికి విధుల్లో లేని స్టాఫ్ నర్సు పై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తానని డాక్టర్ అంబిక తెలిపారు.

Infant’s dead by negligence of Government Hospital Staff

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.