పారిశ్రామిక ఉత్పత్తి 21 నెలల కనిష్టానికి

మార్చిలో 0.1 శాతం నమోదు న్యూఢిల్లీ: మార్చి నెలలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) మరింత కనిష్టానికి పతనమైంది. మార్చిలో 0.1 శాతంగా నమోదైంది. 2017 జూన్ తర్వాత తొలిసారిగా ఐఐపి ప్రతికూల స్థాయికి పడిపోయింది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఐఐపి 21 నెలల కనిష్టానికి చేరింది. తయారీ రంగం నెమ్మదించడంతో సూచీ పడిపోయింది. ఉత్పాదక 0.4 శాతానికి చేరింది. అయితే ఫిబ్రవరిలో చూసిన 1.2 శాతం మొత్తం వృద్ధితో పోలిస్తే వినియోగదారుల వృద్ధి […] The post పారిశ్రామిక ఉత్పత్తి 21 నెలల కనిష్టానికి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మార్చిలో 0.1 శాతం నమోదు

న్యూఢిల్లీ: మార్చి నెలలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) మరింత కనిష్టానికి పతనమైంది. మార్చిలో 0.1 శాతంగా నమోదైంది. 2017 జూన్ తర్వాత తొలిసారిగా ఐఐపి ప్రతికూల స్థాయికి పడిపోయింది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఐఐపి 21 నెలల కనిష్టానికి చేరింది. తయారీ రంగం నెమ్మదించడంతో సూచీ పడిపోయింది. ఉత్పాదక 0.4 శాతానికి చేరింది. అయితే ఫిబ్రవరిలో చూసిన 1.2 శాతం మొత్తం వృద్ధితో పోలిస్తే వినియోగదారుల వృద్ధి 5.1 శాతం తగ్గింది. ఫిబ్రవరితో పోలిస్తే విద్యుత్ రంగం 2.2 శాతం, మైనింగ్ రంగం వృద్ధి 0.8 శాతం చొప్పున వృద్ధి సాధించింది. ప్రైవేటు వినియోగం తగ్గుముఖం పట్టడం, స్థిరమైన పెట్టుబడులు పెరగడం, ఎగుమతులు తగ్గడం లాంటివి ప్రభావం చూపాయని ఆర్థికమంత్రిత్వ శాఖ నివేదికలో పేర్కొంది. అలాగే వ్యవసాయ రంగం వృద్ధిలో మెరుగుదల, పరిశ్రమలో వృద్ధిని కొనసాగించడం సవాలుగా మారిందని పేర్కొంది.

Industrial output shrinks by 0.1% in March

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పారిశ్రామిక ఉత్పత్తి 21 నెలల కనిష్టానికి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: