ఇంద్రవెల్లి విరులకు నెత్తుటి సలాం

  ఇంద్రవెల్లి: అడవి బిడ్డల హక్కుల కోసం 1981 ఏప్రిల్ 20న ప్రభుత్వంతో పోరాడి ప్రాణాలు కొల్పోయిన అమరవీరులకు ప్రతి ఏటా ఏప్రిల్ 20న నివాళు అర్పించడం కొనసాగుతునే ఉంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంద్రవెల్లి ఘటనకు 38 ఏళ్లు పూర్తైన సందర్భంగా పలువురు గిరిజనులు, ఆదివాసీలు, ప్రజాప్రతినిధులు శనివారం ఇంద్రవెల్లి మండల శివారులో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. గత ప్రభుత్వం పాలనలో ఇదే రోజు స్థూపం వద్ద అమరులకు నివాళులు […] The post ఇంద్రవెల్లి విరులకు నెత్తుటి సలాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇంద్రవెల్లి: అడవి బిడ్డల హక్కుల కోసం 1981 ఏప్రిల్ 20న ప్రభుత్వంతో పోరాడి ప్రాణాలు కొల్పోయిన అమరవీరులకు ప్రతి ఏటా ఏప్రిల్ 20న నివాళు అర్పించడం కొనసాగుతునే ఉంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంద్రవెల్లి ఘటనకు 38 ఏళ్లు పూర్తైన సందర్భంగా పలువురు గిరిజనులు, ఆదివాసీలు, ప్రజాప్రతినిధులు శనివారం ఇంద్రవెల్లి మండల శివారులో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. గత ప్రభుత్వం పాలనలో ఇదే రోజు స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించేందుకు ఆంక్షాలు ఏర్పాడ్డాయి. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీ అమరులకు నివాళులు అర్పించేందుకు పోలీసు అధికారులు అవకాశం కల్పించడం పట్ల ఆదివాసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ సాంప్రదాయ పద్దతిలో ఆదివాసీ గిరిజనులు మొదటగా ఇంద్రాయిని దేవతకు పూజలు నిర్వహించిన అనంతరం అమరవీరుల స్థూపం వద్ద తమ ఆచార వ్యవహారాల ప్రకారం ఆదివాసీ అమరవీరులకు ఘనమైన నివాళులర్పించారు.

పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పొయిన గిరిజన అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రశాంతంగా జరిగింది. స్థూపం వద్ద ఉదయం 11 గంటల సమయంలో స్థూపం వద్దకు చేరుకున్న ఆదివాసీలు తమ సాంప్రదాయం పద్దతిలో పూజలు చేసి స్థూపానికి ఎదురుగా ఉన్న జెండాలను ఎగరవేసి, వరసగా నిలబడి నివాళులర్పించారు. ఇదిలా ఉండగా ఇంద్రవెల్లి అమరవీరులకు స్వేచ్చ నివాళులర్పించేందుకు అనుమతినిచ్చిన పోలీసులు స్థూపం వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అదనపు ఎస్ పి మెహన్, ఉట్నూర్ డిఎస్ పి డేవిడ్, ఉట్నూర్, సిఐ వినోద్, నార్నూర్ సిఐ కుమారస్వామి, ఇచ్చేడ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివాసీ అమరవీరుల సంస్మరణ సభ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆదివాసీ హక్కుల సాధన సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కలిసి ఆదివాసీ అమరవీరులకు ఘననివాళి అర్పించారు.

అమరవీరుల ఆశయ సాధన కమిటీ వ్యవస్థాపకుడు ఆత్రం భుజంగ్‌రావ్, ఆదివాసీ సంఘాల నాయకులు సిడాం భీంరావ్, మడావి రాజు, జువాజీరావు, వెడ్మ బొజ్జు, ఆసిఫాబాద్ కుమ్రం భీం జిల్లా గ్రంధాలయ చైర్మన్ కనక యాదవ్ రావ్, తుకారం, తదితరులు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. వారిని ఆదర్శంగా తీసుకోని ఆదివాసీలు ముందుకు సాగాలని ఆదివాసీ సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోయం బాపురావ్ మాట్లాడుతూ… ఆదివాసీ హక్కుల కోసం నిరంతరం పోరాడుతామని, ఆదివాసీలను అడవి నుంచి వెల్లగొట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ అమరవీరుల కుటుంబాలకు తన వంతు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ అమరవీరుల ఆశయ సాధన కమిటీ అధ్యక్షులు పుర్క బాపురావ్, తుడుందెబ్బ జిల్లా నాయకులు అర్క ఖమ్ము ఆదివాసీ ఆంద్ సంఘం జిల్లా అధ్యక్షులు ముఖాడే విష్ణు, తోడసం నాగోరావ్ తదితరులు పాల్గొన్నారు.

Indravelli carnage of tribals completes 39 years

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇంద్రవెల్లి విరులకు నెత్తుటి సలాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: