తెలంగాణలో అడవుల పునరుద్ధరణ

వచ్చే ఐదేళ్ళలో 10 లక్షల హెక్టార్లలో అడవులు అటవీ సంరక్షణ, పచ్చదనం పెంపే లక్ష్యం అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అడవుల పునర్‌జ్జీవనం, అటవీ ప్రాంతాల్లో ప్రకృతి పునరుద్దరణ, అటవీ ప్రాంతాల్లో ప్రకృతి పెంపొందించడమే లక్షంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. అటవీ ప్రాంత పునరుద్ధరణ జాతీయ, అంతర్జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహల అభివృద్ధి సదస్సును […] The post తెలంగాణలో అడవుల పునరుద్ధరణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వచ్చే ఐదేళ్ళలో 10 లక్షల హెక్టార్లలో అడవులు
అటవీ సంరక్షణ, పచ్చదనం పెంపే లక్ష్యం
అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అడవుల పునర్‌జ్జీవనం, అటవీ ప్రాంతాల్లో ప్రకృతి పునరుద్దరణ, అటవీ ప్రాంతాల్లో ప్రకృతి పెంపొందించడమే లక్షంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. అటవీ ప్రాంత పునరుద్ధరణ జాతీయ, అంతర్జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహల అభివృద్ధి సదస్సును ఆయన ప్రారంభించారు. గురువారం ఓ ప్రైవేట్ హోట్‌ల్‌లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయుసిఎన్), ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, కేంద్ర, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల సంయుక్త భాగస్వామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ, అటవీ ప్రాంతాలను పునరుద్ధరించాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు.

నాలుగేళ్ళ కిందట ప్రారంభమైన పునరుద్ధరణ పనుల సత్ఫలితాలు ఇప్పుడు ప్రత్యక్షంగా కన్పిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. సామాజిక అడవుల పెంపకం, ఆవాస ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ఉపయోగపడితే అడవుల పెంపకం మొత్తం వాతావరణంలో మార్పు తెస్తుందని, వర్షాలు బాగా కురవటానికి, జీవ వైవిధ్యానికి, నీటి నిర్వహణకు దోహదపడుతుందని వెల్లడించారు. ఇందుకోసం జాతీయ ఉపాధి హామీ నిధులను సమర్ధవంతంగా వినియోగిస్తున్నట్లు మంత్రి చెప్పారు. తెలంగాణలో పచ్చదనాన్ని 33 శాతం పెంచడానికి పెద్ద ఎత్తున తెలంగాణకు హరితహారం కార్యక్రమం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పచ్చదనం, అటవీ ప్రాంత పునరుద్దరణ 3 లక్షల హెక్టార్లకు పెరిగిందన్నారు. వచ్చే ఐదేండ్లల్లో 10 లక్షల హెక్టార్ల అడవులను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

అటవీ పునరజ్జీవ, పునరుద్దరణ కార్యక్రమంలో భాగంగా 2.65 లక్షల హెక్టార్లలో అటవీ సరిహద్దుల రక్షణ, నేలలో తేమను నిలుపుకోవడం, అగ్ని ప్రమాద నిరోధించడంతో పాటు ఇతర చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణకు హరితహారం అద్భుత కార్యక్రమం అని, పర్యావరణ రక్షణకు ఇది ఎంతో దోహదపడుతుందని సదస్సులో పాల్గొన్న భారత అటవీ పరిశోధన మండలి డిజి సురేష్ గైరోల అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చక్కగా అమలు చేస్తోందని ప్రశంసించారు. మిగతా రాష్ట్రాలు కూడా హరితహారం అధ్యయనం చేసి, అమలు చేయాలని, అలా అయితేనే జాతీయ స్థాయి సగటు అటవీ విస్తీర్ణం 33 శాతానికి చేరుకోగలమని తెలిపారు. సదస్సులో పాల్గొన్న వివిధ జాతీయ అటవీ, పర్యావరణ సంస్థల ప్రతినిధులు పర్యావరణ పరంగా వస్తున్న మార్పులు, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం అటవీ నిర్వహణ, కర్బన ఉద్గారాల తగ్గింపులో అటవీశాఖ పాత్రలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, యుఎస్ ఎయిడ్ ఇండియా ప్రతినిధి వర్గీస్ పాల్, కేంద్ర అటవీ శాఖ ఐజి పంకజ్ ఆస్థాన, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ సుభాష్ అషుతోష్, పిసిసిఎఫ్ ఆర్. శోభ, రిటైర్డ్ అటవీశాఖ ఉన్నతాధికారులు బిఎస్‌ఎస్. రెడ్డి, పికె ఝాతో పాటు వివిధ జిల్లాల అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Indrakaran Reddy launched the International Conference

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తెలంగాణలో అడవుల పునరుద్ధరణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: