ప్రమోటర్ల గొడవతో ఇండిగో షేరు 11 శాతం డౌన్

  న్యూఢిల్లీ: ప్రమోటర్ల మధ్య విభేధాల కారణంగా బుధవారం ఇండిగో షేరు భారీగా పతనమైంది. ఇండిగో బ్రాండుతో విమానయాన సేవలు అందిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కంపెనీకి చెందిన ప్రమోటర్ల మధ్య విభేదాలు తలెత్తాయి. లావాదేవీల అంశంపై ప్రమోటర్ రాకేష్ గంగ్వాల్ సహప్రమోటర్ రాహుల్ భాటియాపై ఆరోపణలు చేస్తున్నట్లు మీడియా పేర్కొంది. ఈ అంశంపై గత నెలలోనే భాటియా డైరెక్టర్ల బోర్డుతోపాటు కంపెనీ సెక్రటరీకి కూడా లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి […] The post ప్రమోటర్ల గొడవతో ఇండిగో షేరు 11 శాతం డౌన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: ప్రమోటర్ల మధ్య విభేధాల కారణంగా బుధవారం ఇండిగో షేరు భారీగా పతనమైంది. ఇండిగో బ్రాండుతో విమానయాన సేవలు అందిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కంపెనీకి చెందిన ప్రమోటర్ల మధ్య విభేదాలు తలెత్తాయి. లావాదేవీల అంశంపై ప్రమోటర్ రాకేష్ గంగ్వాల్ సహప్రమోటర్ రాహుల్ భాటియాపై ఆరోపణలు చేస్తున్నట్లు మీడియా పేర్కొంది. ఈ అంశంపై గత నెలలోనే భాటియా డైరెక్టర్ల బోర్డుతోపాటు కంపెనీ సెక్రటరీకి కూడా లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఫిర్యాదు చేయడంతోపాటు వాటాదారుల అసాధారణ సర్వసభ్య సమావేశాని(ఎజిఎం)కి గంగ్వాల్ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.

తమ గ్రూప్ సంస్థలు కంపెనీ మధ్య లావాదేవీల విషయంలో ఆరోపణలు చేస్తున్న గంగ్వాల్ ఎలాంటి సమాచారాన్ని దాఖలు చేయలేదని భాటియా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రమోటర్ల మధ్య వివాదాలు చెలరేగిన వార్తలతో ప్రస్తుతం ఇంటర్‌గ్లోబ్ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో ఎన్‌ఎస్‌ఇలో ఇండిగో షేరు ఓ దశలో 12 శాతంపైగా కుప్పకూలింది. ఆఖరికి 11 శాతం నష్టంతో రూ.1392 వద్ద ముగిసింది. మరోవైపు ఇప్పటికే జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో జోరందుకున్న స్పైస్‌జెట్‌కు ఈ పరిణామం సానుకూలంగా మారడంతో కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో స్పైస్‌జెట్ షేరు 2 శాతం లాభపడింది.

IndiGo share down 11% as rift between promoters reaches

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రమోటర్ల గొడవతో ఇండిగో షేరు 11 శాతం డౌన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: