బ్రిటన్ సంపన్నుల్లో నెం.1 హిందూజా బ్రదర్స్

  22 బిలియన్ పౌండ్ల ఆస్తులతో జాబితాలో మొదటి స్థానం రెండో స్థానంలో రూబెన్ బ్రదర్స్ న్యూఢిల్లీ : బ్రిటన్‌లో వార్షిక అత్యంత సంపన్నుల జాబితాలో భారత సంతతికి చెందిన సోదరులు తమ అధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. 22 బిలియన్ పౌండ్ల ఆస్తులతో హిందూజా బ్రదర్స్ మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 18.66 బిలియన్ పౌండ్ల సంపదతో ముంబైకి చెందిన రూబెన్ బ్రదర్స్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. భారీగా పెరిగిన హిందూజాల సంపద శ్రీచంద్, గోపీచంద్ హిందూజాలు […] The post బ్రిటన్ సంపన్నుల్లో నెం.1 హిందూజా బ్రదర్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

22 బిలియన్ పౌండ్ల ఆస్తులతో జాబితాలో మొదటి స్థానం
రెండో స్థానంలో రూబెన్ బ్రదర్స్

న్యూఢిల్లీ : బ్రిటన్‌లో వార్షిక అత్యంత సంపన్నుల జాబితాలో భారత సంతతికి చెందిన సోదరులు తమ అధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. 22 బిలియన్ పౌండ్ల ఆస్తులతో హిందూజా బ్రదర్స్ మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 18.66 బిలియన్ పౌండ్ల సంపదతో ముంబైకి చెందిన రూబెన్ బ్రదర్స్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు.

భారీగా పెరిగిన హిందూజాల సంపద
శ్రీచంద్, గోపీచంద్ హిందూజాలు బ్రిటన్‌లో హిందూజా గ్రూప్ ఆఫ్ కంపెనీలను నడిపిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే వీరు సంపద 1.35 బిలియన్ పౌండ్లు పెరిగింది. దీంతో హిందుజా బ్రదర్స్ 2014, 2017 సంవత్సరాల తర్వాత మళ్లీ మొదటి స్థానం దక్కించుకున్నారు. యురోపియన్ యూనియన్‌ను బ్రిటన్ వదిలేసిందో లేదా గానీ గోపీ హిందూజా కుటుంబం తన మాతృభూమితో సన్నిహిత సంబంధాలను కలిగి ఉందని నిరూపించారంటూ.. హిందూజా గ్రూప్ కొచైర్ జిపి హిందూజా(79) గురించి వార్తా పత్రిక ప్రశంసించింది. లండన్‌కు చెందిన వ్యాపారవేత్తలైన హిందూజా బ్రదర్స్ శ్రీచంద్(83), ప్రకాశ్(73)లతో పాటు అశోక్(68)లు జెనీవా, ముంబైలలో నివసిస్తున్నారు. 2018లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 40 బిలియన్ పౌండ్ల టర్నోవర్‌తో 50కి పైగా కంపెనీలు వీరి నియంత్రణలో ఉన్నాయి. కార్లటన్ హౌస్ టెర్రాస్‌లోని లండన్ హోమ్స్‌ను ఈ కుటుంబం సొంతం చేసుకుంది. దీనిని 2006లో క్వీన్ ఎలిజబెత్2 నుంచి కొనుగోలు చేసింది. 1914 సంవత్సరంలో ముంబైలో తండ్రి పరమానంద్ వారి వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. మాంసం, మద్యాన్ని వదిలిన హిందూ భక్తులుగా పేర్కొనే హిందూజాలు చమురు, గ్యాస్, ఐటి, ఎనర్జీ, మీడియా, బ్యాంకింగ్, ప్రాపర్టీ, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో వాటాలను కల్గి ఉన్నారు.

4 నుంచి రెండో స్థానానికి రూబెన్ బ్రదర్స్
ముంబైకి చెందిన సోదరురులు డేవిడ్ రూబెన్(80), సైమన్ రూబెన్(77)లు గతేడాది లండన్‌లో 1 బిలియన్ పౌండ్ల విలువచేసే ఆస్తువులను కొనుగోలు చేశారు. వీరు 2018లో నాలుగో స్థానంలో ఉన్నారు. అయితే గతేడాదితో పోలిస్తే 3.56 బిలియన్ పౌండ్ల ఆస్తులు పెరగడం వల్ల ఈసారి రెండో స్థానాన్ని దక్కించుకున్నారు.

11కు పడిపోయిన మిట్టల్ స్థానం
భారత సంతతికి చెందిన మరో బిలియనీర్ లక్ష్మీ ఎన్.మిట్టల్ గతేడాదితో పోలిస్తే దాదాపు 3.99 బిలియన్ పౌండ్లను కోల్పోయారు. 2018లో 5వ స్థానంలో ఉన్న మిట్టల్ ఈసారి 11వ స్థానికి పడిపోయారు. అలాగే కెమికల్స్ సంస్థ వ్యవస్థాపకుడు సర్‌జిమ్ రాట్‌క్లిఫ్ గతేడాది జాబితాలో టాప్‌లో ఉండగా, ఈసారి 18.15 బిలియన్ పౌండ్ల ఆస్తులతో మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

టాప్ 10 జాబితా
1. శ్రీ, గోపి హిందూజా (ఇండస్ట్రీ అండ్ ఫైనాన్స్). ఆస్తుల విలువ 22 బిలియన్ పౌండ్లు
2. డేవిడ్, సైమన్ రూబెన్ (ప్రాపర్టీ అండ్ ఇంటర్నెట్). ఆస్తుల విలువ 18.7 బిలియన్ పౌండ్లు
3. సర్ జిమ్ రాట్‌క్లిఫె (కెమికల్స్) 18.2 బిలియన్ పౌండ్లు
4. సర్ లెన్ బ్లవాట్నిక్ (ఇన్వెస్ట్‌మెంట్, మ్యూజిక్, మీడియా) 14.4 బిలియన్ పౌండ్లు
5. సర్ జేమ్స్ డైసన్ అండ్ ఫ్యామిలీ (హౌస్‌హోల్డ్ గూడ్స్ అండ్ టెక్నాలజీ) 12.6 బిలియన్ పౌండ్లు
6. కిర్‌స్టన్, జోర్న్ రసింగ్ (ఇన్హెరిటెన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్) 12.3 బిలియన్ పౌండ్లు
7. చార్లీన్ డి కార్వాల్హో-హీనెకెన్ (ఇన్హెరిటెన్స్, బ్రూవింగ్ అండ్ బ్యాంకింగ్) 12 బిలియన్ పౌండ్లు
8. అలిషర్ ఉస్మానోవ్ (మైనింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్) 11.3 బిలియన్ పౌండ్లు
9. రోమన్ అబ్రమోవిచ్ (ఆయిల్ అండ్ ఇడస్ట్రీ) 11.2 బిలియన్ పౌండ్లు
10. మిఖైల్ ఫ్రిడ్మన్ (ఇండస్ట్రీ) 10.9 బిలియన్ పౌండ్లు

Indian origin Hinduja brothers ranked at No.1 in UK rich list

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బ్రిటన్ సంపన్నుల్లో నెం.1 హిందూజా బ్రదర్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: