జాదవ్‌ను కలవనున్న భారత అధికారులు

Indian officials meet Kulbhushan Jadhav

 

దుబాయ్: మరణ శిక్ష ఎదుర్కొంటున్న భారత మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయంలో భారత అధికారులు కలుసుకునే అవకాశాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం కల్పించనున్నది. గూఢచర్యం ఆరోపణపై మూడేళ్ల క్రితం అరెస్టయిన జాదవ్‌కు గత సెప్టెంబర్‌లో తన సమీప బంధువులను కలుసుకునే అవకాశాన్ని పాకిస్తాన్ కల్పించింది. పాకిస్తాన్ సైనిక కోర్టు తనకు విధించిన మరణశిక్షపై రివ్యూ పిటిషన్ వేసుకోవడానికి జులై 20 వరకు పాకిస్తాన్ వ్యవధి ఇచ్చింది. కాగా, తనకు విధించిన మరణ శిక్షపై ఇస్లామాబాద్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందకు జాదవ్ నిరాకరించినట్లు గత వారం పాకిస్తాన్ వెల్లడించింది. అయితే, భారత ప్రభుత్వం మాత్రం ఈ వాదనను తిరస్కరించింది. తీర్పుపై అప్పీలు చేసుకునే అవకాశాన్ని కల్పించకుండా ఉండేందుకే పాక్ ఈ ఎత్తుగడలకు పాల్పడుతోందని భారత్ స్పష్టం చేసింది.

Indian officials meet Kulbhushan Jadhav

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post జాదవ్‌ను కలవనున్న భారత అధికారులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.