సవాళ్లకు దీటుగా రక్షణ వ్యవస్థ

భారతదేశ రక్షణ వ్యవస్థలో ఒక విభాగమయిన ఇండియన్ నావికాదళం ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉంది. వీరు కేవలం దేశ రక్షణకే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సహాయకులుగా ఉంటున్నారు. ఇండియన్ నేవీ ప్రస్తుతం స్వదేశంలో ఉన్న నౌకలతో పాటు విదేశాల నుండి కూడ నౌకలను కొనుగోలు చేస్తున్నది. సముద్ర ఉపరితల, అంతర్భాగ, ఆకాశయానాల గుండా వచ్చే శత్రు సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. ఇంతటి బృహత్తర రక్షణ విధులను నిర్వహిస్తున్న నేవీకి ఎస్‌ఎస్‌సీ నుంచి […]

భారతదేశ రక్షణ వ్యవస్థలో ఒక విభాగమయిన ఇండియన్ నావికాదళం ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉంది. వీరు కేవలం దేశ రక్షణకే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సహాయకులుగా ఉంటున్నారు. ఇండియన్ నేవీ ప్రస్తుతం స్వదేశంలో ఉన్న నౌకలతో పాటు విదేశాల నుండి కూడ నౌకలను కొనుగోలు చేస్తున్నది. సముద్ర ఉపరితల, అంతర్భాగ, ఆకాశయానాల గుండా వచ్చే శత్రు సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది.

ఇంతటి బృహత్తర రక్షణ విధులను నిర్వహిస్తున్న నేవీకి ఎస్‌ఎస్‌సీ నుంచి ఎంటెక్ వరకు: బీఎస్సీ నుంచి ఎంఎస్సీ వరకు వివిధ అర్హతలున్న మానవ వనరుల అవసరం తప్పనిసరి. పట్టుదల, శ్రమించే గుణం ఉంటే.. పదోతరగతి నుంచి పీజీ వరకూ అర్హతతో ఎవరైనా నేవీలో కెరీర్ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం నేవీలో ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతున్న నేపథ్యంలో యువత నేవీలో అందుబాటులో ఉన్న అవకాశాల గురించి అవగాహన పెంచుకోవాలి.ఇండియన్ నేవీలో ప్రధానంగా ఆఫీసర్, సైలర్ కేడర్లు, ఇతర ఉద్యోగాలు ఉంటాయి. ఆఫీసర్ కేడర్‌లో ఎగ్జిక్యూటివ్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎడ్యుకేషన్, మెడికల్ విభాగాల్లో నియామకాలు జరుగుతాయి. సైలర్ కేడర్లో ఆర్టిఫీసర్ అప్రెంటీస్, ఎస్‌ఎస్‌ఆర్, మెట్రిక్ రిక్రూట్, మ్యుజీషియన్, స్పోర్ట్స్ తదితర కొలువులకు భర్తీ జరుగుతుంది.

ఎగ్జిక్యూటివ్ : జనరల్ సర్వీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులైన వారు వార్‌షిప్‌కి మార్గనిర్దేశం (లీడర్) చేస్తారు.

షిప్ సిబ్బందికి దిశానిర్దేశం చేయడం: ఆధునిక యుద్ధ వ్యూహాల రచన తదితరాలు వీరి బాధ్యతగా చూడవలసి ఉంటుంది.
శిక్షణ, అభివృద్ధి: ఎంపికైన అభ్యర్థులకు ఎజిమల లోని నావల్ అకాడమీలో 44 వారాల నావల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. దీనికి కొనసాగింపుగా వివిధ నావల్ శిక్షణా కేంద్రాలు, షిప్‌ల్లో శిక్షణ ఉంటుంది.

విద్యార్హత: బీఈ/బీటెక్ (ఏదైనా బ్రాంచ్).

హైడ్రోగ్రఫీ ఆఫీసర్లు
హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్లు సముద్ర జలాల్లో సర్వే నిర్వహిస్తారు. అవసరాన్ని బట్టి అంతర్జాతీయ జలాలు, పరస్పర స్నేహ సంబంధాల్లో భాగంగా మిత్ర దేశాలకు చెందిన సముద్ర జలా ల్లోనూ సర్వేలు చేపడతారు. అంతేకాకుండా వీరు అత్యుత్తమ ప్రమాణాలతో రూపొందించే నావిగేషన్ చార్టులు ప్రపంచంలోని నావికులంతా ఉపయోగిస్తారు.
శిక్షణ, అభివృద్ధి: ఎంపికైన అభ్యర్థులకు ఎజిమలలోని నావల్ అకాడమీలో 44 వారాల నావల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. దీనికి కొనసాగింపుగా వివిధ నావల్ శిక్షణా కేంద్రాలు, షిప్‌ల్లో శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తిచేసిన వారిలో కొందరిని గోవాలోని హైడ్రోగ్రఫీ స్కూల్‌లో ఇన్‌స్ట్రక్టర్లుగా నియమిస్తారు. దీనికి బీఈ/ బీటెక్ విద్యార్థులు అర్హులు.

పైలట్ సవాళ్లతో కూడిన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ పైలట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపాల్సి ఉంటుంది.
శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఎజిమలలోని నావల్ అకాడమీలో 22 వారాల నావల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. దీనికి కొనసాగింపుగా ఎయిర్ ఫోర్స్ అకాడమీ/నావల్ ఎస్టాబ్లిష్‌మెంట్/ ఇందిరాగాంధీ ఉడాన్ అకాడమీ (ఐజీఆర్‌యూఏ)లో రెండు దశల్లో శిక్షణ ఉంటుంది.

విద్యార్హత: బీఈ/బీటెక్. ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ను చదివి ఉండాలి. డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి కమర్షియల్ పైలట్ లెసైన్స్ పొందుండాలి.
అబ్జర్వర్ యుద్ధ సమయాల్లో అబ్జర్వర్ ఆఫీసర్లు సముద్ర వాయు మార్గాలను పర్యవేక్షిస్తూ నేవీ సిబ్బందిని సమన్వయం చేస్తారు. దీంతోపాటు సోనిక్స్, రాడార్స్, కమ్యూనికేషన్ పరికరాలను ఆపరేట్ చేస్తారు.
విద్యార్హత: బీఈ/బీటెక్. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి.

లాజిస్టిక్ ఆఫీసర్..
బడ్జెట్ ప్రణాళిక, అంచనాలు, అమలు;షిప్‌లకు అవసరమైన రోజువారీ విడిభాగాలకు సంబంధించిన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. లాజిస్టిక్ ఆఫీసర్లుగా ఎంపికైన వారికి సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల్లో శిక్షణ ఇస్తారు.

శిక్షణ: ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సు; అనంతరం వివిధ నేవల్ శిక్షణా కేంద్రాలు, యూనిట్లు, షిప్‌ల్లో శిక్షణ ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారికి నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదా లభిస్తుంది.

విద్యార్హత: మొదటి శ్రేణిలో బీఈ/బీటెక్/ఎంబీఏ/ఎంసీఏ/ఎంఎస్సీ (ఐటీ) ఉత్తీర్ణత లేదా బీఎస్సీ/ బీకామ్/ బీఎస్సీ (ఐటీ)తో పాటు ఫైనా న్స్/ లాజిస్టిక్స్/ సప్లయ్ చైన్ మేనేజ్ మెంట్/ మెటీ రియల్ మేనేజ్‌మెంట్ లలో పీజీ డిప్లొమా ఉండాలి.ఫర్ వర్క్‌ః బీఈ/బీటెక్ (సివిల్)/ బీఆర్క్.

నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్
శిక్షణ, అభివృద్ధి: ఎంపికైన అభ్యర్థులకు ఎజిమలలోని నావల్ అకాడమీలో 44 వారాల నావల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. దీనికి కొనసాగింపుగా వివిధ నావల్ శిక్షణా కేంద్రాలు, షిప్‌ల్లో శిక్షణ ఇస్తారు. విద్యార్హత: మెకానికల్/సివిల్/ఏరోనాటికల్/ మెటలర్జీ/నావల్ ఆర్కిటెక్చర్ స్పెషైలైజేషన్లతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. 60 శాతం మార్కులు తప్పనిసరి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్
శిక్షణ, అభివృద్ధి: ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. దీనికి కొనసాగింపుగా వివిధ నేవల్ శిక్షణా కేంద్రాలు, యూనిట్లు, షిప్‌ల్లో ట్రైనింగ్ ఇస్తారు. వీటిని విజయవంతంగా పూర్తిచేసిన వారికి సబ్ లెఫ్టినెంట్ హోదా లభిస్తుంది. విద్యార్హత:60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజనీరింగ్/ఐటీ) లేదా బీఎస్సీ (ఐటీ) లేదా ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్) లేదా ఎంఎస్సీ (కంప్యూటర్స్) లేదా బీసీఏ/ ఎంసీఏ ఉత్తీర్ణత.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్ :
శిక్షణ, అభివృద్ధి: ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ఉం టుంది. దీనికి కొనసాగింపుగా వివిధ నేవల్ శిక్షణా కేంద్రాలు, యూనిట్లు, షిప్‌ల్లో శిక్షణ ఇస్తారు. వీటిని పూర్తిచేసిన వారు సబ్ లెఫ్టినెంట్ హోదాతో నేవీలో చేరుతారు.
విద్యార్హత: బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చది వుండాలి.

జడ్జ్ అడ్వకేట్, జ్యుడీషియల్ ఆఫీసర్
శిక్షణ; అభివృద్ధి: ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకడామీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. అనంతరం వివిధ నేవల్ శిక్షణా కేంద్రాలు, యూనిట్లు, షిప్‌లలో శిక్షణ పూర్తిచేసుకున్న వారికి నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదా లభిస్తుంది.
విద్యార్హత: న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణత. అడ్వకేట్స్ యాక్ట్-1961 కింద న్యాయవాదిగా నమోదై ఉండాలి.

ఫిజికల్ ట్రైనింగ్ ఆఫీసర్
శిక్షణ, అభివృద్ధి: ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. అనంతరం వివిధ నేవల్ శిక్షణా కేంద్రాలు, యూనిట్లు, షిప్‌ల్లో శిక్షణ పూర్తిచేసిన వారికి సబ్ లెఫ్టినెంట్ హోదా లభిస్తుంది. విద్యార్హత: అథ్లెటిక్స్/క్రాస్ కంట్రీ/ట్రైత్లాన్/ బ్యాడ్మింటన్/ టెన్నిస్/ స్క్వాష్/ఫుట్‌బాల్/ హ్యాండ్‌బాల్/హాకీ/బాస్కెట్‌బాల్/వాలీబాల్/క్రికెట్/స్విమ్మింగ్/డైవింగ్/వాటర్ పోలో/కబడ్డీ/బాక్సింగ్ విభాగా ల్లో జాతీయస్థాయి సీనియర్ లెవల్ చాంపియన్ షిప్స్ లేదా గేమ్స్ లో పాల్గొని ఉండాలి.

నేవల్ మ్యుజీషియన్స్ : శిక్షణ, అభివృద్ధి: ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. దీనికి కొనసాగింపుగా వివిధ నేవల్ శిక్షణా కేంద్రాలు, యూనిట్లు, షిప్‌ల్లో శిక్షణ పూర్తిచేసిన వారు సబ్ లెఫ్టినెంట్ హోదాకు చేరుతారు.

వివిధ నోటిఫికేషన్ల ద్వారా సివిల్ విభాగం కింద ప్యూన్, సఫాయి వాలా, వాచ్‌మెన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెలిఫోన్ ఆపరేటర్, ఎల్‌డీసీ, ఛార్జ్‌మెన్ తదితర ఉద్యోగాలు భర్తీ చేస్తారు. నేవీలో అధికారి లేదా సైలర్ కేడర్లలోని ఏ ఉద్యోగంలో చేరాలన్నా.. ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతోపాటు ఫిజికల్, మెడికల్ టెస్ట్‌ల్లో అర్హత సాధించాలి.

Comments

comments

Related Stories: