రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు…

currencyదుబాయ్: నిజామాబాద్ చెందిన ఓ వ్యక్తి దుబాయ్ లాటరీలో 4.08 మిలియన్ డాలర్ల(సుమారు 29 కోట్లు) ఫ్రైజ్ మనీని గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి నివాసి విలాస్ రిక్కల పని కోసం భార్యతో కలిసి దుబాయ్ వెళ్లాడు. పని దొరక్కపోవడంతో 45 రోజుల క్రితం స్వస్థలానికి తిరిగి వచ్చాడు. వచ్చేటప్పుడు తన భార్య వద్ద ఉన్న రూ. 20 వేలు తీసుకుని తన స్నేహితుడికి ఇచ్చి లాటరీ టికెట్లు కొనుగోలు చేయమన్నాడు. కాగా స్నేహితుడు కొనుగోలు చేసిన టికెట్లు దుబాయ్ బిగ్ లాటరీలో విలాస్‌ను విజేతగా నిలిపాయి. భర్య పద్మనే ఈ సంతోషానికి, వేడుకకు కారణమని విలాస్ చెబుతున్నాడు. విలాస్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జీవిస్తున్నాడు.

Indian man borrows Rs 20000 from wife for Dubai raffle

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.