పాక్ కాల్పుల్లో భారత జవాను మృతి

Pak Armyజమ్మూకశ్మీర్ : పాక్ జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను వీరమరణం పొందాడు.  కృష్ణా ఘాటి (కేజీ) సెక్టార్ లో భారత సైనిక పోస్టులను టార్గెట్ గా  చేసుకుని పాక్ సైనికులు కాల్పులు జరిపారు. పాక్ కాల్పులను భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే పాక్ సైనికుల కాల్పుల్లో నాయక్ రవి రంజన్ కుమార్ సింగ్ వీరమరణం పొందాడని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు తరువాత సరిహద్దుల్లో పాక్ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే పదేపదే కాల్పుల విరమణ ఒప్పందానికి వారు తూట్లు పొడుస్తున్నారు.
Indian Jawan Dead In Pak Army Firing At Jammukashmir

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పాక్ కాల్పుల్లో భారత జవాను మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.