జనతీర్పులు సరిగా వుంటాయా?

హిట్లర్ వంటి నరహంతకులను కూడా అధికార అందలం ఎక్కించింది జనమే. చరిత్రలో నియంతలు, నరహంతకులను జనం ముందుగా గుర్తించిన దాఖలాలు లేవు. చరిత్ర పాఠాలను సక్రమంగా తీసుకొని జాగ్రత్తలు పడుతున్నదీ లేదు. ఐరోపాలో హిట్లరూ, ముస్సోలినీ, ఫ్రాంకో, లాటిన్ అమెరికా, కొన్ని ఆఫ్రికన్, ఆసియా దేశాలలో ఇలా ఎందరినో జనం చూశారు. అలాంటి శక్తులకు అధికారం వస్తే ఏమి జరుగుతుందో మిగతా ప్రపంచం కంటే అలాంటి పాలనల్లో మగ్గిన వారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాంటి అనేక […] The post జనతీర్పులు సరిగా వుంటాయా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హిట్లర్ వంటి నరహంతకులను కూడా అధికార అందలం ఎక్కించింది జనమే. చరిత్రలో నియంతలు, నరహంతకులను జనం ముందుగా గుర్తించిన దాఖలాలు లేవు. చరిత్ర పాఠాలను సక్రమంగా తీసుకొని జాగ్రత్తలు పడుతున్నదీ లేదు. ఐరోపాలో హిట్లరూ, ముస్సోలినీ, ఫ్రాంకో, లాటిన్ అమెరికా, కొన్ని ఆఫ్రికన్, ఆసియా దేశాలలో ఇలా ఎందరినో జనం చూశారు. అలాంటి శక్తులకు అధికారం వస్తే ఏమి జరుగుతుందో మిగతా ప్రపంచం కంటే అలాంటి పాలనల్లో మగ్గిన వారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాంటి అనేక దేశాలలో, ఆ నియంతలకు బలైన దేశాలలో ఫాసిస్టు శక్తులు పెరుగుతున్న తరుణమిది.

ఆర్ధిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులు, వదలని మాంద్య పరిస్థితులు వున్నపుడు వాటిని మార్చి అచ్చే దిన్ (మంచి రోజులు) తెచ్చే దేవదూతలుగా నిరంకుశ శక్తులు ముందుకు రావటం గత చరిత్ర. ఇప్పుడు కూడా ప్రపంచంలో అదే పరిస్థితిని ఆసరా చేసుకొని ఆశక్తులు తలెత్తుతున్నాయి. చరిత్ర పునరావృతం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అది పాత రూపం, పాత పద్ధతుల్లోనే వుండనవసరం లేదు, వుండదు కూడా. మితవాద భావజాలానికి వూతమిస్తున్నదీ, దాని వెంట నడుస్తున్నదీ కూడా జన మే. అంటే జనం కూడా తప్పులు చేస్తారు అని చరిత్రే చెప్పింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ముందే చెప్పుకున్నట్లు అలాంటి తప్పు మెజారిటీ చేస్తే మెజారిటీ, తక్కువ మంది చేస్తే మైనారిటీ చేశారనే చెప్పాలి.మధ్యయుగాల నాడు దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు మత యుద్ధాలు జరిగాయని చరిత్ర చదువుకున్నాము. క్రైస్తవులకు చెందిన పవిత్ర భూమిని ముస్లింలు ఆక్రమించారని దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని 1095లో పోప్ రెండవ అర్బన్ పిలుపు మేరకు కానిస్టాంటినోపుల్ రాజధానిగా వున్న బైజాంటైన్ రాజ్య రాజు తొలి మత యుద్ధాన్ని ప్రారంభించాడు. అవి 1291 వరకు సాగా యి. పవిత్ర ప్రాంతాల స్వాధీనంలో విఫలమయ్యాయి. తరువాత ముస్లిం రాజులు విజృంభించి 150 సంవత్సరాల తరువాత బైజాంటైన్ రాజ్యాన్నే స్వాధీనం చేసుకొని ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని విస్తరించి 20వ శతాబ్దం వరకు తిరుగు లేకుండా ఏలారు.

మత యుద్ధాలను సమర్థ్ధించాలా లేదా అనేదాన్ని పక్కన పెడితే దానికి పవిత్ర ప్రాంతాలను మరొక మతం వారు స్వాధీనం చేసుకున్నారనే ఒక సాకు వుంది. నిజానికి ఆ ప్రాంతాలను ఎవరూ స్వాధీనం చేసుకోలేదు. పవిత్ర ప్రాంతాలుగా వర్ణితమైన చోట ఒక నాడు యూ దు మతాన్ని జనం అవలంభించారు, అదే చోట యూదు మతం మీద తిరుగుబాటు లేదా విభేదించిగానీ క్రైస్తవం, తిరిగి అదే కారణాలతో క్రైస్తవం పరిఢవిల్లిన చోటనే ఇస్లాం మతం వునికిలోకి వచ్చింది తప్ప ఎవరో వచ్చి ఆ ప్రాంతాలను ఆక్రమించ లేదు. మతం ఒక మత్తు, అది ఎక్కిన వారికి వేరే ఏమీ పట్టదు కనుక అబ్రహామిక్ మతాలుగా వున్న యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాల పెద్దలు చరిత్రలో మారణకాండకు కారకులయ్యారన్నది చరిత్ర చెప్పిన సత్యం. మన దేశంలో మతాల చరిత్ర చూసినా ఆ ఛాయలు కనిపిస్తాయి. మన దేశంలో కూడా మత యుద్ధాలకు గత శతాబ్దిలో నాందీ పలికారు. అయితే క్రైస్తవ మత యుద్ధాలు కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొనేందుకు జరిగితే ఇక్కడ హిందూ మత పునరుద్ధరణ పేరుతో ప్రారంభమైంది. దానికి గాను హిందూ మత ప్రార్థనా మందిరాలను ముస్లింలు ఆక్రమించి వాటిని మసీదులుగా మార్చారనే ఆధారాలు లేని వివాదాలను ముందుకు తెచ్చారు. బాబరీ మసీదు ప్రాంతంలోనే రాముడు జన్మించాడని, అక్కడే రామాలయం వుండేదని తమ నమ్మకం అని చెబుతారు. నిజానికి మొఘల్, ఇతర ముస్లిం పాలకులు దేవాలయాలను నాశనం చేసి మసీదులుగా మార్చి లేదా నిర్మించి వుంటే ఆలయాలేవీ మిగిలేవి కాదు. ఇతర మతాలవారు హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు, మత మార్పిడులకు పాల్పడుతున్నారు అనే పేరుతో వారి మీద బస్తీమే సవాల్ అంటూ అన్ని రకాల దాడులు చేస్తున్నారు.

మెజారిటీ మతానికి ముప్పు ఏర్పడింది అనే ఒక అభిప్రాయాన్ని గణనీయమైన సంఖ్యలో కలిగించటంలో జయప్రదమయ్యారు. అలాంటి వారికి మరొక అంశం పట్టదు. బెంగాల్ రాష్ర్ట విభజనకు బ్రిటీష్‌వారు చెప్పిన కారణాలు ఏవైనప్పటికీ దాన్ని కొందరు హిందూ ముస్లిం విభజనగా చూశారు. హిందువుల హక్కల పరిరక్షణ పేరుతో 1910 దశకంలో ప్రారంభమైన హిందూ మహాసభ, తరువాత 1925లో వునికిలోకి వచ్చిన ఆర్‌ఎస్‌ఎస్ హక్కుల స్ధానంలో హిందుత్వ పరిరక్షణగా మార్చి వేశారు. ఒక అబద్దాన్ని వంద సార్లు చెబితే అది చివరికి నిజమై కూర్చుంటుందన్న గోబెల్స్ సూత్రీకరణను అమలు జరిపి హిందూ మతానికి ముప్పు ఏర్పడిందని నిజంగానే నమ్మేట్లు చేశారు. వందల సంవత్సరాల మొఘలాయీల, బ్రిటీష్ వారి పాలనలో దేశంలో ఎన్ని మత మార్పిడులు జరిగినప్పటికీ 80 శాతం మంది హిందువులుగానే వున్నారు.

ఎన్నడో వందల సంవత్సరాల నాడు మతం మార్చుకున్నవారు కూడా హిందువులే అన్నది హిందూత్వ వాదుల అభిప్రాయం. దానిలో పాక్షిక సత్యం వుండవచ్చు, పంచముల పేరుతో గణనీయమైన జనాన్ని సామాజిక, ఆర్థిక అణచివేతకు గురించి చేసిన హిందూ మనువాదమే దానికి కారణం. ఒకవేళ హిందూత్వ వాదులు కోరుకుంటున్నట్లు ఎవరైనా ముస్లింలు, క్రైస్తవులు తిరిగి హిందూ మతంలోకి వారిని ఏ కులంలో చేర్చుకుంటా రు. ఇప్పటికే వున్న వందలు, వేల కులాలకు తోడుగా ముస్లిం, క్రైస్తవ కులాలను ఏర్పాటు చేయటం తప్ప మరొక మార్గం ఏముంది. అలా మారి వారు బావుకునేదేముంది?

మత యుద్ధాలు రెండు వందల సంవత్సరాలు సాగాయంటే సామాన్యులు పాల్గొనకుండా సాధ్యమేనా? మరి ఆ సామాన్యులు చేసింది మంచా, చెడా? చెడే అని చరిత్ర తీర్పు చెప్పింది. వారెందుకు ఆ చెడ్డ పని చేశారు అన్నది వెంటనే వచ్చే ప్రశ్న. చరిత్రకారుడు గిల్స్ కానిస్టేబుల్ అభిప్రాయం ప్రకారం మత యుద్ధాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎవరి కారణాలు వారికున్నాయి. క్లారివాక్స్‌కు చెందిన సెయింట్ బెర్నాడ్ 1140వ సంవత్సరంలో శక్తిశాలి సైనికుడు లేదా యుద్ధ వీరుడు అనే పేరుతో రాసిన దానిలో నీవు ఇప్పుడు యుద్ధం చేయాల్సిన తరుణం వచ్చింది. నీవు గనుక విజయం సాధిస్తే అది కీర్తనీయం అవుతుంది. ఒకవేళ జెరూసలేము కొరకు పోరాటంలో మరణించావనుకో నీవీ స్వర్గంలో ఒక చోటును గెలుచుకుంటావు, పవిత్ర నగరాన్ని మత ద్రోహుల నుంచి విముక్తి చేసి యాత్రీకులకు దారి ఏర్పా టు చేయాలంటే దాన్ని విముక్తి చేయాలన్న పోప్ పిలుపులను నీవు పాటించాలి అని పేర్కొన్నారు. గతంలో చేసిన తప్పిదాల నుంచి క్షమాపణ పొందటానికి పాల్గొనాలి. మత యుద్ధాల్లో పాల్గొన్న ఎవరినైనా క్షమిస్తానని పోప్ ఒక అవకాశం ఇచ్చారు.

అనేక యుద్ధాల్లో ఎందరి ప్రాణాలనో తీసిన రాజులకు ఇది అవసరంగా కనిపించింది. యుద్ధంలో పాల్గొనటం ద్వారా కొత్త ప్రపంచాన్ని చూడవచ్చు, ఒక సాహసం చేసినట్లు వీరత్వాన్ని ప్రదర్శించటానికి అవకాశం దొరుకుతుంది అని కొందరు భావించారు. తలిదండ్రుల నుంచి వారసత్వంగా భూములు, సంపదలు పొందే అవకాశంలేని కుమారులు విదేశాల్లో భూములు, సంపదలు పొందవచ్చని పాల్గొన్నారు. ఈ యుద్ధంలో పాల్గొంటే స్వేచ్ఛ నిస్తామని పోప్ వాగ్దానం చేశారు కనుక బానిసలు, ఫ్యూడల్ శక్తుల వద్ద బందీలుగా వున్న రైతులు అందుకోసం దాడుల్లో భాగస్వాములయ్యారు. తమకు తలనొప్పిగా వున్న సామంత రాజులు, లేదా రాజకుటుంబీకులను వదలించుకొనేందుకు వారిని మత యుద్ధాలకు పోవాల్సిందిగా రాజులు ఆదేశాలు జారీ చేశారు. మరి కొందరు చరిత్ర కారుల అభిప్రాయం ప్రకారం మత యుద్ధాల వెనుక ప్రధాన లక్ష్యం మతపరమైనదే అయినప్పటికీ పాల్గొన్న అనేక మందికి పైన పేర్కొన్న సంపదలు, భూమి, అధికారం వంటి ఆకాంక్షలు కూడా వున్నాయి.

జెరూసలెవ్‌ుకు వెళ్లే దారిలో కానిస్టాంటినోపుల్ సమీపంలోని ఎడేసా అనే ప్రాంతం లేనప్పటికీ దాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకొనేందుకు అక్కడి క్రైస్తవులను కూడా హతమార్చటాన్ని అందుకు తార్కాణంగా చూపారు. మన దేశంలో మత యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్న వారి వెనుక బయటికి కనిపించని అంశాలెన్నో వున్నా పైకి చెబుతున్నది మాత్రం హిందూ మత రక్షణ. ఇది పవిత్ర యుద్ధం అని భావిస్తున్నవారికి తెలియని ఆవేశం, మతానికి ఏదో ముప్పు వచ్చి పడుతోందన్న మానసిక భయం తప్ప పైన పేర్కొన్న మత యుద్ధాలలో మాదిరి సంపద లు, భూములు, రాజ్యాల వంటి లక్ష్యాలు వున్నాయని చెప్పలేము, వారికి హిందూత్వ శక్తుల ముసుగు అజెం డా ఏమిటో తెలుసా అంటే తెలియదనే చెప్పాలి. ఎవరైనా మాకు తెలుసు అంటే విద్వేషం తలకు ఎక్కించుకున్నవారు తప్ప వేరు కాదు. వివేచనలేని ఆవేశం, గుడ్డి నమ్మకాలు, గుడ్డి ద్వేషంతో బాబరీ మసీదును కూల్చివేసింది, లేదా గో రక్షణ పేరుతో దాడుల్లో, మత ఘర్షణల్లో పాల్గొంటున్నదీ సామాన్యులే.

వీరిలో కేంద్ర ప్రభు త్వ విధానాల వలన నష్టపోతున్న రైతు బిడ్డలు, వ్యవసాయ కార్మికులు, వృత్తులు అంతరించి నిరుద్యోగ సైన్యంలో చేరుతున్న చేతివృత్తులవారూ, నిరుద్యోగులూ, ధరల పెరుగుదల వలన బతుకు అతలాకుతలం అవుతున్నవారూ అంద రూ వున్నారు. వారెవరూ ఓటు వేయకుండా బిజెపి, దాని మిత్రపక్షాలకు అన్ని ఓట్లు ఎలా వస్తాయి. ఇలా ఎందుకు జరుగుతోందో అంతు తెలియ ని అంశమేమీ కాదు. దాన్నుంచి జనాన్ని ఎలా మళ్లించాలనేదే అసలైన సమస్య. జనం ఆమోదం పొందటం వేరు, జనం చేత ఆమోదింప చేయటం, మాయలో పడవేయటం వేరు. రెండోదాన్ని ఆంగ్లంలో మాన్యుఫాక్చరింగ్ కన్సెంట్ అంటున్నారు. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే మాయలో పడవేసి జనం చేత తలూపించటం. సంఘటితమైనదిగా పైకి కనిపించకుండా అది సామాజిక లేదా సాంప్రదాయ మాధ్యమాల ద్వారా, మౌఖిక ప్రచారం, ప్రతి దానినీ వాణిజ్యీకరణ ద్వారా కొన్ని సిద్ధాంతాలు, పదసమూహాలు, రూపాలు లేదా నమ్మకాలు వేటినైనా సరే ఎలాంటి వివరణ అడగకుండా, హేతుబద్ధమైన ప్రశ్నలు లేకుండా ఆమోదం తెలిపేట్లు, విధేయత చూపేట్లు, మొగమాటం పెట్టి తలూపేట్లు చేసే విధానం ఇప్పుడు ప్రపంచ సమాజాన్ని వూపివేస్తున్నది.

అందుకు మనది మినహాయింపు కాదు. మచ్చుకు ఏమిటీ మీకు ఎయిడ్సా అన్నట్లుగా మీ పిల్లలను ప్రభుత్వ స్కూలుకు పంపుతున్నారా, మీరు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతున్నారా, మీకు కారు కూడా లేదా అని ఎవరైనా అడిగితే ఎదుటి వారు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. ఈ ఎన్నికల సందర్భంగా టివి ఛానల్స్ చర్చల్లో ప్రజల సమస్యల మీద జరిగిన చర్చ లెన్ని, రాజకీయ వివాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలపై చర్చలెన్నో పరిశీలించండి. అంటే యాజమాన్యాల ప్రయోజనాలకు నష్టంలేని లేదా పాలకులకు ఆగ్రహం కలిగించని అంశా ల చుట్టూ చర్చలను పరిమితం చేయటం, బలవంతంగా చూపటం వాటికి అలవాటు చేయటం దీనిలో భాగమే.

టివి ఛానల్స్, పత్రికలను మనం డబ్బు చెల్లించే పొందుతున్నాం. మనం డబ్బు చెల్లించేటపుడు మనకు కావాల్సింది పొందుతున్నామా లేదు, డబ్బిచ్చి మరీ వారు చూపింది చూస్తున్నాం, ఇచ్చిన వార్తలను చదువుతున్నాం. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే సమాచారం వాస్తవమైనదా కాదా అనే విచక్షణతో ఎందరు పరిశీలిస్తున్నారు. ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా అనే ఆరు ప్రశ్నలను అడగలేని బలహీనతకు లోనైన స్థితిలోకి మనల్ని నెట్టారంటే అతిశయోక్తి కాదు. మన పిల్లలకు వాటిని నేర్పుతున్నామా అంటే లేదు. మా పెద్దలు చేశారు, మేము చేస్తున్నాము, మీరు కూడా చేయండి. మేము కూడా ప్రశ్నించలేదు అంటూ ప్రశ్నించే తత్వాన్ని మొగ్గలోనే తుంచి వేస్తున్నాం. అలాంటి తరం మా పెద్దలు పాలకులను నిలదీయలేదు మేము మాత్రం ఎందుకు చేయాలి అంటే దేశం ఎటుపోతుంది. ప్రతి కొన్ని సంవత్సరాలకు తమను అణచివేసే అసామాన్య ప్రతినిధులెవరో నిర్ణయించుకొనేందుకు అణచివేతకు గురయ్యేవారు అనుమతిస్తారు అని కారల్ మార్క్స్ చెప్పారు. ఇప్పుడు మన దేశంలో అదే జరుగుతోందా? గతంలో కాంగ్రెస్‌ను అనుమతిస్తే ఇప్పుడు మతవాదుల వంతు వచ్చిందా ?

ఎం కోటేశ్వరరావు
8331013288

Indian General Election 2019

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జనతీర్పులు సరిగా వుంటాయా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.