నో డౌట్.. టీమిండియాలో అతడే నెం.01

Kapil Devభారత వెటరన్ క్రికెటర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని ప్రశంసలతో ముంచెత్తారు. సక్సెస్ ఫుల్ కెప్టెన్, బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు మహేంద్ర సిగ్ ధోని అని, అతడి ఆటతీరు గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుందని కపిల్ అన్నారు. ప్రస్తుత భారత జట్టులో నెంబర్ వన్ ఆటగాడు ఎవరన్న దానిపై జరుగుతున్న చర్చను గుర్తుచేస్తూ… అందులో ఎలాంటి సందేహం లేదని, తప్పకుండా ధోనీనే నెంబర్ వన్ ఆటగాడని కపిల్ కితాబిచ్చాడు. ఈ మాట తాను చెబుతున్నది కాదని యావత్ భారత క్రికెట్ అభిమానులే చెబుతున్నారన్నారు. ఈ దేశానికి ఎక్కువ సేవ చేస్తున్న క్రికెటర్‌ ఎవరైనా ఉన్నారంటే అది ధోనీయేనని కొనియాడారు.

సుదీర్ఘకాలంగా ఫిట్‌నెస్‌ను కాపాడుకోని క్రికెట్ ఆడటం మహేంద్రుడు ఒక్కడికే చెల్లిందని, ఇది అంత సులభమై విషయం కాదని ప్రశంసించారు.  ఇలా దేశం కోసం తన వ్యక్తిగత ఇష్టాలను కూడా కాదనుకోవడం వల్లే  మహీకి ఇది సాధ్యమైందనే విషయాన్ని ఈ సందర్భంగా కపిల్ గుర్తు చేశారు. వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న ప్రపంచ కప్ లో ధోనీ కీలకం కానున్నాడని కపిల్ దేవ్  జోస్యం చెప్పారు. అంతేగాక ఈ మెగా టోర్నీలో ఆతిథ్య ఇంగ్లండ్ తోపాటు టీమిండియా హాట్ ఫేవరేట్ అని ఆయన తెలిపారు. ఇక 1983లో కపిల్ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి వరల్డ్ కప్ ను ముద్దాడిన సంగతి తెలిసిందే. అలాగే 2011లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో రెండోసారి భారత్ ప్రపంచ కప్ గెలిచింది.

Indian Former Cricketer Kapil Dev Praises MS Dhoni

The post నో డౌట్.. టీమిండియాలో అతడే నెం.01 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.