పాక్ లో భారత్ సినిమాలు నిషేథం

ఇస్లామాబాద్ : జమ్మూకాశ్మీర్ విభజన , ఆర్టికల్ 370 రద్దుతో భారత్ పై దాయాది దేశమైన పాక్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలోనే పాక్ భారత్ తో ఉన్న వాణిజ్య బంధాన్ని తెంచుకుంది. జమ్మూకాశ్మీర్ విషయంలో అంతర్జాతీయ మద్దతు కూడగట్టుకునేందుకు పాక్ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఈ క్రమంలో సరిహద్దు వెంబడి భారత్ సైనికులు మోహరించారు. అయితే భారతీయ సినిమాలపై పాక్ నిషేథం విధించింది. పాక్ లోని థియేటర్లలో ఇకపై భారత్ సినిమాలు ప్రదర్శించబడవని […] The post పాక్ లో భారత్ సినిమాలు నిషేథం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఇస్లామాబాద్ : జమ్మూకాశ్మీర్ విభజన , ఆర్టికల్ 370 రద్దుతో భారత్ పై దాయాది దేశమైన పాక్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలోనే పాక్ భారత్ తో ఉన్న వాణిజ్య బంధాన్ని తెంచుకుంది. జమ్మూకాశ్మీర్ విషయంలో అంతర్జాతీయ మద్దతు కూడగట్టుకునేందుకు పాక్ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఈ క్రమంలో సరిహద్దు వెంబడి భారత్ సైనికులు మోహరించారు. అయితే భారతీయ సినిమాలపై పాక్ నిషేథం విధించింది. పాక్ లోని థియేటర్లలో ఇకపై భారత్ సినిమాలు ప్రదర్శించబడవని పాక్ సమాచార, ప్రసారశాఖ స్పెషల్ అసిస్టెంట్ డాక్టర్ పిర్దౌసి ఆశిక్ అవన్ తెలిపారు. ఆర్టికల్ 370ను పునరుద్ధరించే వరకు కాశ్మీరీలకు పూర్తి మద్ధతు ఇస్తామని ఆమె తేల్చి చెప్పారు. భారత్ సినిమాలపై నిషేథం విధించడంతో పాక్ భారీగా ఆర్థిక నష్టం చవిచూడనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Indian Films Banned In Pakistan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పాక్ లో భారత్ సినిమాలు నిషేథం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: