‘భారత్’మూవీని వీక్షించిన టీమిండియా ఆటగాళ్లు

  లండన్: ప్రపంచకప్‌లో బిజీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు విశ్రాంతి కోసం భారత్ సినిమాను చూశారు. భారత్ సినిమాలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించారు. ఈ మూవీని కేదార్ జాదవ్, ధోనీ, పాండ్యా, రాహుల్, శిఖర్ ధావన్ నాటింగ్ హామ్‌లోని సినిమా హాల్‌లో వీక్షించారు. సల్మాన్ వీరాభిమాని కేదార్ జాదవ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. భారత జట్టుతో అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. కేదార్ జాదవ్ ట్వీట్ చేసిన అనంతరం సల్లూ […] The post ‘భారత్’ మూవీని వీక్షించిన టీమిండియా ఆటగాళ్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లండన్: ప్రపంచకప్‌లో బిజీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు విశ్రాంతి కోసం భారత్ సినిమాను చూశారు. భారత్ సినిమాలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించారు. ఈ మూవీని కేదార్ జాదవ్, ధోనీ, పాండ్యా, రాహుల్, శిఖర్ ధావన్ నాటింగ్ హామ్‌లోని సినిమా హాల్‌లో వీక్షించారు. సల్మాన్ వీరాభిమాని కేదార్ జాదవ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. భారత జట్టుతో అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. కేదార్ జాదవ్ ట్వీట్ చేసిన అనంతరం సల్లూ భాయ్ స్పందించారు. తాను నటించిన మూవీని చూసినందుకు భారత క్రికెటర్లకు సల్లూ థాంక్యూ చెప్పారు. ఇండియన్స్ మీతో ఉన్నారని సల్మాన్ రిప్లై ఇవ్వడంతో పాటు టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి రెండిట్లో  విజయం సాధించింది. గురువారం న్యూజిలాండ్‌తో ఆడనుంది. మూడో మ్యాచ్‌కు ముందుకు భారత జట్టుకు గట్టిగానే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్‌కు గాయం కావడంతో మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ధావన్‌కు సూచించారు.

 

Indian Cricket Team Watches Bharat Movie in London

The post ‘భారత్’ మూవీని వీక్షించిన టీమిండియా ఆటగాళ్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: