ఖైదీలకోసం విమానం టిక్కెట్లు…

 

దుబాయ్: ఇక్కడ విదేశీ ఖైదీలుగా ఉన్నవారికోసం దుబాయ్‌కి చెందిన భారతీయ వ్యాపారవేత్త వన్ వే విమాన టిక్కెట్లను (ఒకవైపు నుంచి ప్రయాణించేందుకు) కొన్నారు. ఖైదీలు విడుదలైన తర్వాత వారు ఇంటికి వెళ్లేందుకు ఆయన ఈ టిక్కెట్లను కొన్నారని మంగళవారం ఒక మీడియా రిపోర్ట్ తెలిపింది. ఖైదీల్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనా, ఉగాండా, నైజీరియా, ఇథియోపియా, ఆఫ్గనిస్థాన్‌కు చెందిన వారున్నారు. పెహల్ ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ ఛైర్మన్, పెహల్ ఛారిటబుల్ ట్రస్ట్ (పిసిటి హ్యుమానిటీ) వ్యవస్థాపకుడు జోగీందర్ సింగ్ సలారియా దుబాయ్ పోలీస్ అధికారుల సమన్వయంతో ఖైదీలకు ఒక వైపు ప్రయాణించేందుకు చెల్లుబాటయ్యే విమాన టిక్కెట్లను కొన్నారు. సోమవారంనాడు ఖైదీల్ని విడుదల చేశారు. ఏవో చిన్నచిన్న నేరాలు చేసినందుకు వారు జైల్లో ఉన్నారని, వారి శిక్షాకాలం ముగిసిందని సలారియా తెలిపారు. ‘ఖైదీలు విమానం టిక్కెట్ల డబ్బు చెల్లించలేరు. బయటి నుంచి ఎలాంటి సాయమూ అందలేదు. అందుకే వివిధ దేశాలకు చెందిన 13 మంది ఖైదీలు స్వదేశం వెళ్లేందుకు సాయం చేశాం’ అని తెలిపారు.

Indian businessman buys Plane tickets for prisoners

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఖైదీలకోసం విమానం టిక్కెట్లు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.