సిరీస్ కైవసం చేసుకున్న భారత్…

 

రాంచీ: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించడంతో 3-0 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. మూడో టెస్టులో సఫారీలపై భారత్ ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో సఫారీలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. నాలుగో రోజు భారత నదీమ్ రెండు వికెట్లు పడగొట్టడంతో 133 పరుగులు చేసి కుప్పకూలింది. సపారీ బాట్స్‌మెన్లలో లిండే (27), బ్రయాన్(30), పిడిట్(23), ఎల్గర్(16), రబడా(12) పరుగులు చేశారు. డూప్లిసెస్, బవుమా డకౌట్ రూపంలో ఔటయ్యారు. ఎల్గర్‌కు గాయకావడంతో రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీయగా ఉమేష్ యాదవ్, నదీమ్ చెరో రెండు వికెట్లు జడేజా, అశ్విన్ చెరో ఒక వికెట్ తీశారు. మూడో టెస్టులో రోహిత్ శర్మ సెంచరీ చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. ఈ సిరీస్‌లో రోహిత్ 529 పరుగులు చేయడంతో మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.

 

ఇండియా తొలి ఇన్నింగ్స్: 497/9 డిక్లేర్డ్

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 162 ఆలౌట్

సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 133 ఆలౌట్ 

 

India Won Test Series against South Africa

The post సిరీస్ కైవసం చేసుకున్న భారత్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.