భారత్‌కు నాలుగో విజయం

  గయానా : వెస్టిండీస్‌తో జరుగుతున్న మహిళల ట్వంటీ20 సిరీస్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. విండీస్‌తో జరిగిన నాలుగో టి20లో కూడా పర్యాటక భారత జట్టు విజయం సాధించింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఐదు పరుగుల తేడాతో జయభేరి మోగించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 40కు చేరింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 9 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 50 […] The post భారత్‌కు నాలుగో విజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గయానా : వెస్టిండీస్‌తో జరుగుతున్న మహిళల ట్వంటీ20 సిరీస్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. విండీస్‌తో జరిగిన నాలుగో టి20లో కూడా పర్యాటక భారత జట్టు విజయం సాధించింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఐదు పరుగుల తేడాతో జయభేరి మోగించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 40కు చేరింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 9 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో భారత్ ఆశించిన స్కోరును అందుకోలేక పోయింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య విండీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఇండియా బౌలర్లు సఫలమయ్యారు. స్పిన్నర్లు రాణించడంతో విండీస్ నిర్ణీత 9 ఓవర్లలో 45 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో అంజు రెండు వికెట్లు తీసింది. దీప్తి, రాధాలకు ఒక్కో వికెట్ దక్కింది.

India win 4th T20 on west indies

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారత్‌కు నాలుగో విజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: