భారత్-విండీస్ వన్డే వర్షార్పణం

గయానా: భారత్‌-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డే వర్షం వల్ల అర్ధాంరతంగా రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గయానాలో ఈ మ్యాచ్ జరిగింది. ప్రారంభం నుంచే మ్యాచ్‌కు వర్షం సమస్యగా తయారైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారీ వర్షం కురియడంతో టాస్ ఆలస్యమైంది. రెండు గంటలు ఆలస్యంగా ఆట ప్రారంభమైంది. అంతేగాక మ్యాచ్‌ను తొలుత 43 ఓవర్లకు కుదించారు. ఈ సమయంలో […] The post భారత్-విండీస్ వన్డే వర్షార్పణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

గయానా: భారత్‌-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డే వర్షం వల్ల అర్ధాంరతంగా రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గయానాలో ఈ మ్యాచ్ జరిగింది. ప్రారంభం నుంచే మ్యాచ్‌కు వర్షం సమస్యగా తయారైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారీ వర్షం కురియడంతో టాస్ ఆలస్యమైంది. రెండు గంటలు ఆలస్యంగా ఆట ప్రారంభమైంది. అంతేగాక మ్యాచ్‌ను తొలుత 43 ఓవర్లకు కుదించారు. ఈ సమయంలో ఆట సాఫీగానే సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఈ దశలో మళ్లీ వర్షం జోరందుకుది. దీంతో ఆటను నిలిపి వేయక తప్పలేదు. తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుదించారు. అయితే ఈసారి వరుణడు మళ్లీ పలుకరించాడు. గతంతో కంటే ఈసారి భారీగా కురిశాడు. వర్షం దెబ్బకు మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులకు నిరాశ తప్పలేదు. ఇక, ట్వంటీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి జోరుమీదున్న టీమిండియాకు తొలి వన్డే రద్దు కావడం అసంతృప్తికి గురిచేసింది.
వన్డేల్లోనూ జయభేరి మోగించాలని భావించిన భారత్‌కు వర్షం నిరాశే మిగిల్చింది. మ్యాచ్ కొనసాగి ఉంటే భారత్ కచ్చితంగా గెలిచి ఉండేదని విశ్లేషకులు సయితం అభిప్రాయపడ్డారు. కానీ, మ్యాచ్ రద్దు కావడంతో టీమిండియా ఆశలు నీరుగారాయి. ఇక, ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరుగనుంది.

India vs West Indies first ODI called off due to rain

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారత్-విండీస్ వన్డే వర్షార్పణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: