వర్షం వచ్చింది మ్యాచ్ ఆగింది

మాంచెస్టర్: అనుకున్నట్టే జరిగింది.. భారత్‌ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో మ్యాచ్‌ను బుధవారం రిజర్వ్‌డ్ డేకు వాయిదా వేశారు. మంగళవారం తొలి రోజు ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ క్రమంలో భారీ వర్షం రావడంతో ఆట అక్కడే ఆగిపోయింది. పలుసార్లు పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు ఆటను తర్వాతి రోజుకు […] The post వర్షం వచ్చింది మ్యాచ్ ఆగింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మాంచెస్టర్: అనుకున్నట్టే జరిగింది.. భారత్‌ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో మ్యాచ్‌ను బుధవారం రిజర్వ్‌డ్ డేకు వాయిదా వేశారు. మంగళవారం తొలి రోజు ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ క్రమంలో భారీ వర్షం రావడంతో ఆట అక్కడే ఆగిపోయింది. పలుసార్లు పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు ఆటను తర్వాతి రోజుకు వాయిదా వేశారు. బుధవారం కివీస్ తమ కిందటి స్కోరు వద్దే మళ్లీ ఆట ప్రారంభిస్తోంది. కివీస్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారత్ లక్షఛేదనకు దిగుతోంది. అయితే మళ్లీ వర్షం అడ్డంకిగా మారకపోతేనే ఇది సాధ్యమవుతోంది. లేకుంటే మ్యాచ్‌ను కుదించే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మ్యాచ్ జరగడం సాధ్యంకాక పోతే భారత్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. లీగ్ దశలో మెరుగైన స్థితిలో ఉండడంతో భారత్ ముందుకు వెళుతోంది. మరోవైపు కివీస్ ఇంటిదారి పట్టక తప్పదు.
ఆదుకున్న విలియమ్సన్
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. అయితే ప్రారంభం నుంచే భారత బౌలర్లు బుమ్రా, భువనేశ్వర్‌లు అసాధారణ బౌలింగ్‌ను కనబరిచారు. దీంతో కివీస్ స్కోరు నత్తనడక సాగింది. పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ ఈసారి కూడా నిరాశ పరిచాడు. 14 బంతులు ఆడిన గుప్టిల్ ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. బుమ్రాకు ఈ వికెట్ దక్కింది. ఒకవైపు బుమ్రా, మరోవైపు బుమ్రా కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో కివీస్ స్కోరు చాలా నెమ్మదిగా సాగింది. తొలి పది ఓవర్లలో న్యూజిలాండ్ 27 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత కెప్టెన్ విలియమ్సన్ కాస్త దూకుడును పెంచాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. మరోవైపు ఓపెనర్ నికోల్స్ 28 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఈ క్రమంలో రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన సీనియర్ ఆటగాడు రాస్ టైలర్‌తో కలిసి విలియమ్సన్ మరో కీలక పార్ట్‌నర్‌షిప్‌ను నెలకొల్పాడు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ ఆరు ఫోర్లతో 67 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా, కెప్టెన్‌గా కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో విలియమ్సన్ 548 పరుగులు సాధించడం విశేషం. మరోవైపు సమన్వయంతో ఆడిన టైలర్ 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా, భువనేశ్వర్, రవీంద్ర జడేజా పొదుపుగా బౌలింగ్ చేశారు.

India Vs New Land Semi Final Match 2019

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వర్షం వచ్చింది మ్యాచ్ ఆగింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: