గులాబీ సమరానికి సర్వం సిద్ధం

సమరోత్సాహంతో భారత్, బంగ్లాదేశ్‌కు పరీక్ష, నేటి నుంచి కోల్‌కతాలో డేనైట్ టెస్టు కోల్‌కతా: దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఎప్పుడెప్పుడా అని అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. భారత గడ్డపై జరిగే చారిత్రక తొలి డేనైట్ సమరానికి ఈడెన్ గార్డెన్స్ సరికొత్త హంగులతో సిద్ధమైంది. భారత్‌బంగ్లాదేశ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి ఈ చారిత్రక సమరం జరుగనుంది. ఇరు జట్లకు ఇదే తొలి డేనైట్ సమరం కావడంతో ఎలా ఆడుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి […] The post గులాబీ సమరానికి సర్వం సిద్ధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
సమరోత్సాహంతో భారత్, బంగ్లాదేశ్‌కు పరీక్ష, నేటి నుంచి కోల్‌కతాలో డేనైట్ టెస్టు

కోల్‌కతా: దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఎప్పుడెప్పుడా అని అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. భారత గడ్డపై జరిగే చారిత్రక తొలి డేనైట్ సమరానికి ఈడెన్ గార్డెన్స్ సరికొత్త హంగులతో సిద్ధమైంది. భారత్‌బంగ్లాదేశ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి ఈ చారిత్రక సమరం జరుగనుంది. ఇరు జట్లకు ఇదే తొలి డేనైట్ సమరం కావడంతో ఎలా ఆడుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ పోరు జరుగనుంది. ఈ చారిత్రక మ్యాచ్ ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది.

భారత్‌లో జరుగుతున్న తొలి డేనైట్ టెస్టు మ్యాచ్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా దీనిపై దృష్టి నెలకొంది. టెస్టు క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగుతున్న భారత్ ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి తీపి జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని తహతహలాడుతోంది. బంగ్లాదేశ్ కూడా టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వడం ద్వారా తామెంటో నిరూపిం చుకోవాలని భావిస్తోంది. ఇక, మ్యాచ్‌ను పురస్కరించుకుని భారత్‌కు చెందిన క్రీడా రంగ దిగ్గజాలను  సత్కరిం చను న్నారు.

ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పి.వి.సింధు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ తదితరులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించనున్నారు. మరోవైపు భారత మాజీ క్రికెట్ కెప్టెన్లు కూడా మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు. ఇలా ఎన్నో ప్రత్యేకతల మధ్య జరిగే మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

బౌలర్లే కీలకం

ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లపై అందరి దృష్టి నెలకొంది. ఇండోర్‌లో మూడో రోజే మ్యాచ్‌ను భారత్‌కు అందించిన బౌలర్లు ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. డేనైట్ మ్యాచ్ కావడం, పింక్ బంతులను ఉపయోగిస్తుండడంతో బౌలర్లు ఎలా రాణిస్తారనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మణికట్లు బౌలర్లు చెలరేగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మంచు కురిసే అవకాశాలు అధికంగా ఉన్న పరిస్థితుల్లో ఫాస్ట్ బౌలర్లతో పోల్చితే స్పిన్నర్లే కీలకంగా మారే అవకాశాలున్నాయి.

సవాలు వంటిదే

ఇప్పటికే ఓ మ్యాచ్‌లో ఓడి పోయిన బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్ చావోరేవోగా తయారైంది. ఇందులో గెలిస్తేనే సిరీస్‌ను సమంగా ముగించే అవకాశాలుంటాయి. ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే భారత్‌కు కనీస పోటీ ఇవ్వడం కూడా బంగ్లాకు కష్టంగానే కనిపిస్తోంది. టీమిండియాతో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బంగ్లా చాలా వెనుకబడి ఉంది. ఫామ్‌లో ఉన్న భారత బ్యా ట్స్‌మెన్‌ను కట్టడి చేయడం బంగ్లా బౌలర్లకు శక్తికి మించిన పనిగా తయారైంది. అంతేగాక బ్యాటింగ్‌లో కూడా బంగ్లాకు కష్టాలు తప్పడం లేదు.

ప్రముఖుల రాక

చారిత్రక డేనైట్ మ్యాచ్‌ను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు మ్యాచ్‌ను చూసేందుకు వస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తదితరులు కూడా ఈ మ్యాచ్‌కు హాజరు కానున్నారు.

జోరు సాగాలి

తొలి టెస్టులో డబుల్ సెంచరీతో కదం తొక్కిన భారత యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌పై అందరి దృష్టి నిలిచింది. ఇండోర్ వేదికగా జరిగిన టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన మయాంక్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు తొలి మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిన స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఈసారి మెరుపులు మెరిపించాలనే లక్షంతో పోరుకు సిద్ధమయ్యాడు.

ఈ మ్యాచ్‌లో రాణించడం ద్వారా దీన్ని తీపి జ్ఞాపకంగా ఉంచుకోవాలని భావిస్తున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో రోహిత్ పరుగుల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వీరిద్దరూ విజృంభిస్తే భారత్‌కు చారిత్రక మ్యాచ్‌లో విజయం నల్లేరుపై నడకేనని చెప్పాలి.

 

india vs bangladesh first pink ball game

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గులాబీ సమరానికి సర్వం సిద్ధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: