రాష్ట్రాలకు దారిచూపే రాష్ట్రం

India Today State of the States Award

 

సమర్థ పాలనకుగాను తెలంగాణకు ఇండియా టుడే స్టేట్ ఆఫ్ స్టేట్స్ అవార్డు
ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేతుల మీదుగా అందుకున్న రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు

హైదరాబాద్: సమర్థవంతమైన పాలన అందించిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి స్టేట్ ఆఫ్ స్టేట్స్ కాన్ క్లేవ్ 2019 అవార్డును ఇండియాటుడే ప్రదానం చేసింది. శుక్రవారం ఢిల్ల్లీలో ఇండియాటుడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక,సామాజిక, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తుందని చెప్పారు. సిఎం కెసిఆర్ కృషితో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమీక్షించి ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని చెప్పారు. నూతనంగా ఆవిర్భవించిన రాష్ట్రం అయినప్పటికీ పరిపాలన అంశంలో ప్రభుత్వం ప్రజలకు చేరువగా ఉందన్నారు.

సిఎం కెసిఆర్ ప్రజలవద్దకు పాలనను తీసుకువెళ్లి వారి అభివృద్ధి,సంక్షేమంకోసం నిరంతరం శ్రమిస్తున్నారని కెకె చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మంత్రం ఏమిటని అడిగిన ఇండియా టుడే సంస్థ ప్రతినిధులకు కెకె బదులుఇచ్చారు. కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కష్టపడే తత్వం, నాయకత్వం, దృష్టి, స్పష్టత అని కెకె చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బండ ప్రకాష్,లింగయ్య గౌడ్ పాల్గొన్నారు. ఇండియా టుడే స్టేట్ ఆఫ్ స్టేట్స్ కాన్ క్లేవ్ 2019 అవార్డును తెలంగాణ ప్రభుత్వానికి ప్రదానం చేసినందుకు రాష్ట్ర మంత్రి,టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈ అవార్డును తీసుకున్న కెకెను కెటిఆర్ అభినందించారు.

India Today State of the States Award for Telangana

The post రాష్ట్రాలకు దారిచూపే రాష్ట్రం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.