2023 హాకీ ప్రపంచకప్‌కు.. భారత్ ఆతిథ్యం

Hockey

న్యూఢిల్లీ: భారత గడ్డపై మరో ప్రపంచ సంగ్రామం జరుగనుంది. 2023లో జరిగే ప్రపంచ పురుషుల హాకీ ఛాంపియన్‌షిప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ప్రపంచ హాకీ సంఘం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇదే క్రమంలో నాలుగు సార్లు ప్రపంచకప్ నిర్వహించే తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. భారత్‌లో ఇప్పటి వరకు మూడు సార్లు హాకీ ప్రపంచకప్‌లు జరిగాయి. భాతర గడ్డపై తొలిసారి 1982లో హాకీ ప్రపంచకప్ జరిగింది. దీనికి ముంబై నగరం ఆతిథ్యం ఇచ్చింది. రెండో సారి ఢిల్లీ వేదికగా 2010లో పురుషుల ప్రపంచకప్ నిర్వహించారు.

చివరి సారిగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో 2018లో ప్రపంచకప్ జరిగింది. మరోసారి 2023లో భారత్‌లో హాకీ ప్రపంచకప్ జరుగనుంది. భారత 75వ స్వాతంత్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని భారత్‌కు ఈ టోర్నమెంట్ నిర్వహించే అవకాశం దక్కింది. కాగా, వేదికను తర్వాత ప్రకటిసతారు. కాగా, ప్రపంచకప్ కోసం భారత్‌తో సహా మూడు దేశాలు బిడ్‌లు దాఖలు చేశాయి. బెల్జియం, మలేసియాలను వెనక్కినెట్టి భారత్ ప్రపంచకప్ నిర్వహించే అవకాశాన్ని దక్కించుకుంది.

India to host 2023 Mens Hockey World Cup

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 2023 హాకీ ప్రపంచకప్‌కు.. భారత్ ఆతిథ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.