పాక్ పన్నాగం

     జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దును అంతర్జాతీయ వివాదంగా మార్చి, భారత్‌ను రచ్చకీడ్చి స్వప్రయోజనాన్ని అమితంగా సాధించుకోవాలని పాకిస్థాన్ నిర్ణయించుకుంది. అక్కడి మన దౌత్యాధికారి (హై కమిషనర్) ని వెనక్కి పంపించి మనతో వాణిజ్య సంబంధాలు రద్దు చేసుకుంటూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం బుధవారం నాడు తీసుకున్న చర్య ఇందుకు ఉద్దేశించినదే. న్యూఢిల్లీకి తన హైకమిషనర్‌గా పంపించాలనుకున్న అధికారిని నిలిపివేయడానికి, కశ్మీర్ వివాదాన్ని ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో ప్రస్తావించడానికి కూడా పాక్ ప్రభుత్వం […] The post పాక్ పన్నాగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

     జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దును అంతర్జాతీయ వివాదంగా మార్చి, భారత్‌ను రచ్చకీడ్చి స్వప్రయోజనాన్ని అమితంగా సాధించుకోవాలని పాకిస్థాన్ నిర్ణయించుకుంది. అక్కడి మన దౌత్యాధికారి (హై కమిషనర్) ని వెనక్కి పంపించి మనతో వాణిజ్య సంబంధాలు రద్దు చేసుకుంటూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం బుధవారం నాడు తీసుకున్న చర్య ఇందుకు ఉద్దేశించినదే. న్యూఢిల్లీకి తన హైకమిషనర్‌గా పంపించాలనుకున్న అధికారిని నిలిపివేయడానికి, కశ్మీర్ వివాదాన్ని ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో ప్రస్తావించడానికి కూడా పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. పాక్ స్వాతంత్య్రోత్సవ దినమైన ఆగస్టు 14ను కశ్మీర్ ప్రజల పట్ల సంఘీభావ ప్రకటన దినంగా, భారత స్వాతంత్య్రోత్సవ దినమైన 15ను చీకటి రోజుగా పరిగణించడానికి కూడా నిర్ణయం తీసుకున్నది. వాణిజ్య సంబంధాలు రద్దు చేసుకోడం మన కంటే పాక్‌కే నష్టదాయకమన్నది వాస్తవం.

భారత పాక్‌ల మధ్య వాణిజ్యంలో మనదే పై చేయిగా ఉన్నది. టెర్రరిస్టు మూకలకు ఆశ్రయమిస్తున్నందువల్ల తనను ద్వేషిస్తున్న అంతర్జాతీయ సమాజం సానుభూతిని పొందడానికి పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితిని వాడుకోదలచింది. ఇంత కాలం ద్వైపాక్షిక సమస్యగా ఉన్న కశ్మీర్‌ను భారత్ బల ప్రయోగం ద్వారా తన ఆంతరింగిక విషయంగా మార్చుకొన్నదని అంతర్జాతీయ సమాజం చెవిలో ఊదరగొట్టడానికి నిర్ణయించుకున్నది. వీలైతే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతు చూరగొనడానికి ప్రయత్నించబోతుంది. అలాగే ఇదే అదనుగా కశ్మీర్ లోయలోకి మరింతగా ఉగ్రవాదులను పంపించాలని, భారత్ అంతటా టెర్రరిస్టు దాడులకు ఉసిగొల్పాలని కోరుకుంటున్నది. కశ్మీర్ నాయకులను, అక్కడి ప్రజలను అపూర్వ నిర్బంధంలో అంధకారంలో ఉంచి చరిత్రాత్మకమైన ఆర్టికల్ 370ను రద్దు చేసిన భారత ప్రభుత్వ చర్య వారిని తనకు చేరువ చేసిందనే సంతృప్తి పాక్‌లో చోటు చేసుకుని ఉండవచ్చు.

ఇంతటితో ఆగబోమని పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను కూడా సాధించుకొంటామని మన హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన ప్రకటన నిజం కావాలంటే పాక్‌తో సాయుధ ఘర్షణ అనివార్యమవుతుంది. (పాక్ ఆక్రమిత కశ్మీర్ తరపున 24 స్థానాలు కశ్మీర్ శాసన సభలో ఇప్పటికీ ఖాళీగా కొనసాగుతున్నాయి) ఈ పరిస్థితిని పూర్తిగా తనకు అనుకూలంగా మలచుకోవాలని పాకిస్థాన్ పథక రచన చేసుకొన్నట్టు బోధపడుతున్నది. ఇందుకు మూలాధారంగా అంతర్జాతీయ సమాజం దన్నును సమీకరించదలనుకున్నది. కేవలం పాక్ కోరినందున కీలకమైన అంతర్జాతీయ శక్తులు దాని వైపు మొగ్గిపోవు, మళ్లిపోవు. అది అంత సునాయాసం కాదు. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత కశ్మీర్ ప్రజల వైఖరి ఎలా ఉంటుంది, వారిని మానసికంగా తన వైపు తిప్పుకోడానికి భారత ప్రభుత్వం ఏమి చేస్తుంది అనే వాటిని బట్టి అంతర్జాతీయ సమాజం ప్రతిస్పందన ఉంటుంది.

పాక్ ప్రోత్సహించి పంపించే ఉగ్ర సంస్థలు పేట్రేగిపోయినా అలా జరగగల అవకాశాలను మొగ్గలోనే తుంచి వేయాలనుకున్నా అక్కడికి మన బలగాలను మరింతగా పంపించక తప్పని పరిస్థితి తలెత్తుతుంది. అతి ప్రధానమైన 370 రద్దు చర్యను తమతో సంప్రదించకుండా తమ సమ్మతి తీసుకోకుండా గైకొన్నారన్న అసంతృప్తి గూడుకట్టుకున్న కశ్మీర్ లోయ సమాజాన్ని అది మరింత అసౌకర్యానికి గురి చేస్తుంది. ఇప్పటికే అక్కడక్కడ రాళ్ల దాడులకు తలపడుతున్నారని వార్తలు చెబుతున్నాయి. భవిష్యత్తులో అణచివేత ఇంకా పెరిగితే కశ్మీర్‌లో మానవ హక్కుల హరణం తీవ్ర రూపం దాల్చిందనే అభిప్రాయం అంతర్జాతీయ సమాజానికి కలగగల అవకాశాలే ఎక్కువ. అందుకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలంటే కశ్మీర్ నుంచి బలగాలను త్వరగా ఉపసంహరించుకోవాలి. అక్కడి ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారనే అభిప్రాయం కలగడానికి అనువైన వాతావరణం నెలకొనాలి. కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించాలని నరేంద్ర మోడీ తనను కోరినట్టు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల వాషింగ్టన్‌లో తనను కలుసుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ అనడం, మన ప్రభుత్వం ఖండించినా అతడు మధ్యవర్తిత్వ కాంక్షను పునరుద్ఘాటించడం తెలిసిందే.

370 రద్దు, జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదాను తొలగించి ఆ భూభాగాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం పట్ల ట్రంప్ మౌనం వహించాడు. దీని మర్మమేమిటో ముందు ముందుగాని తెలియదు. ఆఫ్ఘానిస్థాన్ నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్న అమెరికా ఆ తర్వాత అక్కడ తలెత్తబోయే పరిస్థితులను తన అదుపాజ్ఞలలో ఉంచుకోడానికి పాక్‌ను వినియోగించుకోవాలని చూస్తున్నది. దీనిని వాడుకొని కశ్మీర్ విషయంలో దాని పరిపూర్ణ మద్దతును పొందాలని పాక్ ఆశిస్తున్నది. దీనికి విరుగుడుగా ప్రధాని మోడీ ప్రభుత్వం కశ్మీర్ ప్రజల హృదయ పూర్వక సహకారాన్ని సాధించుకోవలసి ఉన్నది. ఇక ముందు అక్కడ అది ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్న దానిమీదనే అంతా ఆధారపడి ఉంటుంది.

India regrets Pakistan decision to unilaterally

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పాక్ పన్నాగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: